ఇమ్రాన్ ఖాన్‌ను ఎందుకు ఇష్టపడ్డానంటే: రెహామ్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కీర్తిని చూసి తాను అతనిని ఇష్టపడలేదని ప్రముఖ యాంకర్, ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ శనివారం నాడు చెప్పారు. ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న పాపులారిటీ వల్ల తాను అతనిని ఏమాత్రం ఇష్టపడలేదన్నారు. మార్పు తదితర అంశాల గురించి అతను మాట్లాడిన తీరు తనకు నచ్చిందని, అందుకే అతను తనను ఆకట్టుకున్నాడని చెప్పారు.

మీ మాజీ భర్త ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లాడిన విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారనే విషయమై విలేకరులు ప్రశ్నించగా... తాను ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లాడిన విషయమై ఎప్పుడు అబద్దం చెప్పలేదన్నారు. తమ పెళ్లి రిజిస్టర్ కాలేదని, అది తన బాధ్యత కాదన్నారు.
ఇమ్రాన్ ఖాన్‌కు విడాకులు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా తాను ఏం పొందాలనుకోలేదని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ సిటిజన్‌షిప్ ఇంకా వదులుకోలేదు ఎందుకు అని ప్రశ్నించగా.... తన పిల్లలు ఇంకా అక్కడే చదువుకుంటున్నారని సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications