ALERT: చైనాలో మరో కొత్త వైరస్.. ఇక చావులు తప్పవా..!

గత ఐదేళ్ల క్రితం చైనాలో ఉద్భవించిన కొవిడ్-19 ప్రపంచదేశాల్ని అల్లకల్లోలం చేసింది. కరోనా బారిన పడి లక్షల మంది మృతి చెందారు. ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయి. కొవిడ్ వైరస్ అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ ను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొవిడ్-19 వైరస్ ను పోలినట్లు ఈ వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. చైనాలోని పరిశోధకుల బృందం గబ్బిలాల్లో ఈ వైరస్ గుర్తించారు.ఈ వైరస్ కు HKU5-CoV-2గా నామకరణం చేసింది చైనా పరిశోధన బృందం. చైనాలోని ప్రముఖ వార్తా పత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ వివరాలను వెల్లడించింది.

చైనాకు చెందిన పరిశోధకురాలు షీ జెంగ్లీ.. ఈ పరిశోధక బృందానికి హెడ్ గా ఉన్నారు. ఈమెను బ్యాట్ ఉమెన్ గా పిలుస్తారు. ఈ వైరాలజీలో విశేష ప్రతిభ కలిగి ఉన్నారు. ఈమె జరిపిన పరిశోధనల్లోనే గబ్బిలాల్లో HKU5-CoV-2 వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ మైర్బెకోవైరస్‌తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ రకానికి చెందినదిగా కనుగొన్నారు.

Researchers in China Discover HKU5-CoV-2 Virus in Mosquitoes A Potential Pandemic Threat

గబ్బిలాల నుంచి పుట్టిన హెచ్‌కేయూ5-కోవ్‌-2 వైరస్‌ కూడా కొవిడ్-19 మాదిరిగానే రిసెప్టర్‌ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అంటే కొవిడ్‌-19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌-19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం అలాంటిదేమీ లేదని.. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+