Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉక్రెయిన్ సైనిక వైమానిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్‌లను ధ్వంసం చేశాం: రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పొరుగు దేశం అయిన ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టారు. సైనిక దాడిని ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత ఉక్రెయిన్ సైనిక వైమానిక స్థావరాలను మరియు దాని వైమానిక రక్షణ వ్యవస్థలను నాశనం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.

ఉక్రేనియన్ ఆర్మీ వైమానిక స్థావరాలు ధ్వంసం చేశామన్న రష్యా

ఉక్రేనియన్ ఆర్మీ వైమానిక స్థావరాలు ధ్వంసం చేశామన్న రష్యా

ఉక్రేనియన్ ఆర్మీ వైమానిక స్థావరాలలో సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయని రక్షణ మంత్రిత్వ శాఖ వార్తా ఏజెన్సీలు నిర్వహించిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది కైవ్ యొక్క వైమానిక రక్షణ వ్యవస్థలను నాశనం చేసిందని పేర్కొంది. ఉక్రెయిన్ భూభాగంపై దాడి చేస్తున్న రష్యన్ యూనిట్లకు ఉక్రెయిన్ సరిహద్దు సేవ "ఏ విధమైన ప్రతిఘటనను అందించలేదు" అని రష్యన్ మిలిటరీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.ఉక్రెయిన్ యొక్క వైమానిక రక్షణను రష్యా సైన్యం "అణచివేసిందని" ప్రకటన పేర్కొంది.

రష్యా విమానాల కూల్చివేత వాదనలను ఖండించిన రష్యా

రష్యా విమానాల కూల్చివేత వాదనలను ఖండించిన రష్యా

అదే ప్రకటనలో, రష్యా సైన్యం అనేక రష్యన్ విమానాలను కూల్చివేసినట్లు ఉక్రేనియన్ దళాల వాదనలను ఖండించింది. నివేదికలు "వాస్తవానికి అనుగుణంగా లేవు" అని పేర్కొంది.రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో గురువారం తెల్లవారుజామున ఐదు రష్యా విమానాలు మరియు ఒక హెలికాప్టర్‌ను కాల్చివేసినట్లు ఉక్రేనియన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపారు. అయితే అలాంటిది ఏమీ లేదని రష్యా తేల్చి చెప్పింది.

ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య

ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా బాంబుల మోత కొనసాగుతోంది. రష్యా విదేశాంగ మంత్రి "పూర్తి స్థాయి దండయాత్ర" జరుగుతోందని హెచ్చరించారు.ఇతర దేశాలు ఈ సైనిక చర్యను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే కనీవినీ ఎరుగని రీతిలో తక్షణమే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు పుతిన్. తూర్పు ఉక్రెయిన్లోని ప్రజలను కాపాడటం కోసం ఈ సైనికచర్య అవసరమని ఆయన ప్రకటించారు. రష్యా ఆత్మరక్షణ కోసమే దాడి చేస్తోందంటూ వెల్లడించారు. ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకునే ఆలోచన లేదని ఆయన ప్రకటించారు.

Recommended Video

    Russia Begins War On Ukraine And Attacks Continued On 11 Cities | Oneindia Telugu
    పశ్చిమ ఉక్రెయిన్ వైపు నుంచి కూడా రష్యా దాడి

    పశ్చిమ ఉక్రెయిన్ వైపు నుంచి కూడా రష్యా దాడి

    పుతిన్ ప్రకటన వెంటనే సైనిక చర్య ప్రారంభమైంది. దీంతో ఉక్రెయిన్ లో బాంబుల వర్షం కురుస్తోంది. ఉక్రెయిన్ పై ముప్పేట దాడి జరుగుతోంది. ఇదిలా ఉంటే రష్యా తాజాగా పశ్చిమ ఉక్రెయిన్ వైపు నుంచి కూడా దాడి మొదలు పెట్టింది . బెలారస్ వైపునుండి రష్యా దళాలు ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్ ఏజెన్సీపై దాడులు మొదలుపెట్టాయి. ఇక ఈ విషయాన్ని బోర్డర్ గార్డ్ ఏజెన్సీ ప్రకటించింది.

    ఉక్రేనియన్ సరిహద్దు గార్డులు రష్యా మరియు బెలారసియన్ సరిహద్దుల వెంబడి దాడికి గురవుతున్నట్లు నివేదించారు. ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో రష్యా తన దేశం యొక్క "సైనిక మౌలిక సదుపాయాల"పై దాడి చేస్తోందని, అయితే పౌరులు భయపడవద్దని కోరారు. ఈ పోరాటంలో విజయం సాధించాలని ఆయన పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+