Russia-Ukraine war : ఉక్రెయిన్ దురాక్రమణ దిశగా రష్యా-11 నగరాల్లో దాడులు-కీవ్ ఎయిర్ పోర్ట్ స్వాధీనం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా ఇవాళ మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ ఆపరేషన్ క్రమంగా దేశంలోని 11 నగరాలకు విస్తరించింది. రాజధాని కీవ్ తో పాటు ఉక్రెయిన్ లోని 11 నగరాల్లోకి రష్యా సేనలు ప్రవేశించాయి. దీంతో ఆయా చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని రష్యా అధినేత పుతిన్ మిగతా దేశాన్ని హెచ్చరించారు.
Recommended Video
ఉక్రెయిన్ లో కొన్ని రోజులుగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాల హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్ పై పట్టు కోసం ఆ దేశంలోని రెండు వేర్పాటు వాద ప్రాంతాల్ని ప్రత్యేక దేశాలుగా గుర్తించడంతో పాటు అక్కడి నుంచే మిగతా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించింది. ఉక్రెయిన్ చుట్టూ ప్రస్తుతం రష్యాకు చెందిన లక్షన్నర మంది సైన్యం మోహరించింది. ఉక్రెయిన్ లో ఆపరేషన్ ప్రారంభించిన వెంటనే అక్కడి సరిహద్దులతో పాటు చెక్ పోస్టుల్ని రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. బాంబుదాడులతో మిగతా నగరాలను రష్యా భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీనిపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్యా దాడులకు దిగుతున్నా ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఎదురుకావడం లేదని తెలుస్తోంది. దీంతో ఉక్రెయిన్ ను రష్యా అతి తక్కువ సమయంలోనే అక్రమిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్ పై దాడులకు దిగిన రష్యా ఆ దేశ సైన్యం ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలని హెచ్చరికలు చేస్తోంది. ఓవైపు భూ, వాయు మార్గాల్లో దాడులకు దిగుతూనే మరోవైపు సైబర్ దాడులకు కూడా పాల్పడుతోంది. దీంతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఉక్రియిన్ కు మద్దతుగా ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా అండగా నిలుస్తున్నా వెంటనే జోక్యం చేసుకోలేని పరిస్ధితి. దీంతో ప్రస్తుతానికి ఉక్రెయిన్ పై రష్యా ఆధిపత్యం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications