షాకింగ్..: చంద్రుడిని ఢీ కొట్టి ముక్కలైన స్పేస్ క్రాఫ్ట్: ల్యాండింగ్ సమయంలో అవరోధాలు

మాస్కో: చంద్రుడిపై ప్రయోగాలు సాగించడానికి రష్యా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రష్యా పంపించిన స్పేస్ క్రాఫ్ట్.. చిట్టచివరి నిమిషంలో ఘోరంగా విఫలమైంది. జాబిల్లి ఉపరితలపై క్రాష్ ల్యాండింగ్‌కు గురైంది. ల్యాండింగ్ సమయంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని నియంత్రించడంలో రష్యా అంతరిక్ష పరిశోధకులు విఫలం అయ్యారు. ఫలితంగా అది వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టింది.. ముక్కలైంది.

ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రొస్‌కాస్మోస్ ఓ ప్రకటన విడుదల చేసింది. చందమామపై ప్రయోగాలు సాగించడానికి రష్యా.. లూనా 25 పేరుతో మూన్ ల్యాండర్ చంద్రుడిపైకి ప్రయోగించిన విషయం తెలిసిందే. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అవరోధాలు ఏర్పడ్డాయి.

Russias Luna-25 spacecraft has crashed into the moon: reports

ఫలితంగా అది ఉపరితలంపై కుప్పకూలిపోయింది. క్రాష్ ల్యాండింగ్‌కు గురైంది. 2019లో ఇస్రో కూడా ఇలాంటి చేదు అనుభవాన్నే చవి చూసిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 2 కూడా చంద్రుడి ఉపరితలపై క్రాష్ ల్యాండింగ్ అయింది. ఇప్పుడు రోస్‌కాస్మోస్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పుడు అందరి దృష్టీ భారత్ పంపించిన చంద్రయాన్ 3పై నిలిచింది.

47 సంవత్సరాల తరువాత తొలిసారిగా రష్యా.. చందమామపై ప్రయోగాలకు పూనుకుంది. లూనా 25 పేరుతో ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను చంద్రుడిపైకి ప్రయోగించింది. ఆగస్టు 10వ తేదీన ఈ అంతరిక్ష ప్రయోగ నౌక.. జాబిల్లి వైపు దూసుకెళ్లింది. రష్యా ఫార్ ఈస్ట్ రీజియన్‌లో గల ది వోస్టొఖ్ని కాస్మోడ్రోమ్ నుంచి ఈ రాకెట్‌ను పంపించింది.

రష్యా కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2:57 నిమిషాలకు ఈ వ్యోమ నౌక.. చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలపై ల్యాండ్ కావాల్సి ఉంది. ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు.. ఈ రాకెట్‌తో సంబంధాలు తెగిపోయాయి. సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి రొస్‌కాస్మొస్ శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా.. సాధ్యపడలేదు.

సాఫ్ట్ ల్యాండింగ్ అయి ఉండొచ్చని భావించట్లేదని రొస్‌కాస్మొస్ వివరించింది. లూనా 25 నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం గానీ, డేటా గానీ అందలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తమకు అందిన వివరాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించగా.. లూనా 25.. చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టి పేలిపోయి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా ఓ ఇంటర్‌డిపార్ట్‌మెంటల్ కమిషన్‌ను నియమించినట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+