ఐసీజే ఆదేశాలు రష్యా తిరస్కరణ.. ఒప్పందాలను అంగీకరిస్తేనే.. యుద్ధానికి తెర..!!

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరెన్ని చెప్పినా, ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాడులను మరింత తీవ్రతరం చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఈ దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఉక్రెయిన్ ఆశ్రయించింది. మాస్కో చర్యలపై కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఉక్రెయిన్‌పై దాడులను ఆపాలంటూ ఐసీజే కీలక ఆదేశాలు జారీచేసింది. మిలటరీ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కి తీసుకుకోవాలని రష్యాను న్యాయస్థానం ఆదేశించింది.

ఐసీజే ఆదేశాలు తిర‌స్క‌ర‌ణ‌

ఐసీజే ఆదేశాలు తిర‌స్క‌ర‌ణ‌


అయితే రష్యా మాత్రం అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించింది. ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగించేందుకే నిర్ణయించింది. సీజేఐ నిర్ణయాలను తాము పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరిచాల్సి ఉందని తెలిపారు. అటు అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై జెలెన్ స్కీ హర్షం వ్యక్తం చేశారు. తాము అంతర్జాతీయ న్యాయస్థానంలో గెలిచామని తెలిపారు. అమెరికా కూడా సీజేఐ తీర్పును స్వాగతించింది. సీజేఐ ఆదేశాలను గౌరవిస్తూ తమ మిలటరీ ఆపరేషన్ నిలిపి వేసి తమ బలగాలను ఉక్రెయిన్ నుంచి వెనక్కి తీసుకోవాలి ర‌ష్యాను కోరింది. అయినా రష్యా మాత్రం తగ్గడం లేదు

ఒప్పందాల‌ను అంగీక‌రిస్తేనే..

ఒప్పందాల‌ను అంగీక‌రిస్తేనే..


ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ -రష్యా ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగినా ఎలాంటి పరోగతి కన్పించడం లేదు. శాంతి చర్చలకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఇందుకు తమ ప్రతినిధి బృందం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ కంటే తాము ఎక్కువగా సంసిద్ధతగా ఉన్నామని పేర్కొన్నారు. తమ ఒప్పందాలకు ఉక్రెయిన్ అంగీకరిస్తేనే ప్రస్తుత పరిస్థితులకు తెరపడుతుందని చెప్పారు. తమ లక్ష్యం నెరవేరేవరకు ఉక్రెయిన్‌పై దాడులను ఆపేది లేదని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. చర్చలు కొనసాగుతున్న కొద్ది షరతులు కూడా పెరుగుతాయని హెచ్చరించారు.

Recommended Video

    Ukraineలో కనుమరుగవుతున్న నగరాలు, PM Modi అత్యున్నత స్థాయి సమీక్ష!| Oneindia Telugu
    ఉక్రెయిన్ అస్థిర‌త‌కు కార‌ణం ఆదే..

    ఉక్రెయిన్ అస్థిర‌త‌కు కార‌ణం ఆదే..


    మరోవైపు అమెరికాను ఉద్దేశించి రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌కు యుద్ధవిమానాలను , రక్షణ వ్యవస్థను అందజేయడం ద్వారా... ఆదేశంలో అస్థిరతకు కారణమవుతుందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి హెచ్చరించారు. ఇలాంటి పరిణామాలు ఉక్రెయిన్‌కు కచ్చితంగా శాంతి చేకూర్చదని పేర్కొన్నారు. రష్యాను సమర్దవంతంగా ప్రతిఘటించేందుకు నో -ఫ్లె జోన్ విధించడంతో పాటు .. రక్షణ వ్యవస్థలను, యుద్ధవిమానాలను అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికాను కోరారు. ఈనేపథ్యంలో అమెరికాపై రష్యా మరోసారి విరుచుకుపడింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+