7.0 తీవ్రతతో పెను భూకంపం- దెబ్బకు బద్దలైన భారీ అగ్నిపర్వతం

Russia earthquake: రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. ఈ ఘటనలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని బీటలు వారాయి. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు.

రష్యా కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 5:25 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా రికార్డయినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తూర్పు తీర ప్రాంత నగరం పెట్రోపవ్‌లావ్‌స్కీ- కమ్‌చట్‌స్కీ (Petropavlovsk-Kamchatsky) నగరానికి 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

Russia s Shiveluch volcano has erupted following a 7 0 magnitude earthquake

ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. తీర ప్రాంత నగరం కావడం, భూకంప తీవ్రత 7.0గా ఉండటం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని హొనులులులో గల పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తక్షణమే స్పందించింది. సునామీ హెచ్చరికలను జారీ చేసింది.

సునామీ సంభవించే సూచనలేవీ లేకపోవడంతో కొద్దిసేపటి తరువాత వాటిని ఉపసంహరించుకుంది. సునామీ సంభవించనప్పటికీ- తీర ప్రాంతం అల్లకల్లోలానికి గురైంది. సముద్రం పోటెత్తింది. రెండు మీటర్ల ఎత్తువరకు అలలు ఎగిసిపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలను స్థానిక అధికారులు ఖాళీ చేయించారు.

ప్రపంచపటంలో పసిఫిక్ మహాసముద్రం ఉత్తర ప్రాంతం అంచున ఉంటుందీ నగరం. రష్యన్ నౌకాదళానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది. జలాంతర్గములకు బేస్ పాయింట్‌. 1,80,000 మంది జనాభా నివాసం ఉంటోన్నారు ఇక్కడ. అత్యధిక భాగం నావల్ బేస్ ఆధీనంలో ఉంటుంది.

భూకంప తీవ్రతకు ఈ నగరం సమీపంలో ఉండే షివ్‌లచ్ అగ్నిపర్వతం బద్దలైంది. ఆకాశంలో ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మిందంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోపవ్‌లావ్‌స్కీ- కమ్‌చట్‌స్కీ పలు ప్రాంతాలు బూడిదమయం అయ్యాయి. ఈ మార్గంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించినట్లు రష్యన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+