ఉక్రెయిన్ అప్ డేట్స్- విక్టరీ డే కు ముందు రష్యా భీకర దాడులు- సత్తా చాటుకునే యత్నం
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై రెండు నెలలు గడిచిపోతోంది. అయినా ఇప్పటికీ ఫలితం తేలలేదు. అలాగని ఉక్రెయిన్ లొంగిపోయిందా అంటే అదీ లేదు. రష్యా గెలిచిందా అంటే అలా కూడా జరగలేదు. కానీ ఎటూ ఫలితం తేలకుండా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వార్ పై ప్రపంచ దేశాల ఆసక్తి కూడా తగ్గిపోతోంది. దీంతో ఉక్రెయిన్ పై మొదట్లో సానుభూతి చూపి రష్యాను విమర్శించిన దేశాలు కూడా మౌనం వహిస్తున్నాయి.
మరోవైపు రష్యాలో ఏటా మే 9న జరిగే విక్టరీ డే పరేడ్ కు రంగం సిద్దమవుతోంది. నాజీ సేనలపై సాధించిన విజయానికి గుర్తుగా రష్యన్లు జరుపుకునే ఈ విక్టరీ డే సందర్భంగా ఈసారి ఏం చేయాలనే దానిపై అధ్యక్షుడు పుతిన్ తో పాటు రష్యా ప్రభుత్వ వర్గాలు కూడా మల్లగుల్లాలు పడుతున్నాయి. ఉక్రెయిన్ లో విజయంసాధిస్తే దాన్ని విక్టరీ డే రోజు గొప్పగా చెప్పుకోవచ్చని భావించిన రష్యాకు పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు సాయం చేసి చెక్ పెట్టాయి. దీంతో ఇఫ్పుడు పాశ్చాత్య దేశాల సాయంతో ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ పై రష్యా దాడుల్ని ముమ్మరం చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది.

మాస్కోలో విక్టరీ డే ఉత్సవాలకు ముందు రష్యా దళాలు దేశవ్యాప్తంగా కొత్త బాంబు దాడులను ప్రారంభించడంతో ఇవాళ ముట్టడి చేసిన మారియుపోల్ స్టీల్ ప్లాంట్ నుంచి మరింత మంది పౌరులను ఖాళీ చేయించాలని ఉక్రెయిన్ భావిస్తోంది. అజోవ్‌స్టల్ ఉక్కు కర్మాగారం వినాశనానికి గురైన ఓడరేవు నగరంలో ఉక్రేనియన్ ప్రతిఘటన యొక్క చివరి అంకం రష్యా దండయాత్రలో విశాలమైన యుద్ధంలో సిసలైన మలుపుగా మారింది. అక్కడ ఇరుక్కుపోయిన పౌరులు కాంప్లెక్స్ నుంచి పారిపోయేందుకు సంధి గురించి ఇంతకుముందు మాట్లాడినప్పటికీ, రష్యా దళాలు సైట్‌పై తమ దాడిని తిరిగి ప్రారంభించాయని ఉక్రెయిన్ రక్షణ మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications