రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం : రష్యాను వీడాలని అమెరికన్లకు వైట్‌హౌస్ ఆదేశం
రష్యా - ఉక్రెయిన్ మధ్య సంక్షోభం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమైయ్యాయి. తమతమ డిమాండ్లపై పట్టు వీడలేదు. దీంతో బెలారస్ వేదికగా జరిగిన ఈ చర్చలు కొలిక్కి రాలేదు. పరిస్థితి మరలా మొదటికే వచ్చింది.. యుద్ధం వాతావరణం మళ్లీ మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సరిహద్దుల్లో అణ్యాయుధాల మోహరింపు
ఉక్రెయిన్ పై మాస్కో దాడులను ఖండిస్తూ ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ పై మరింత దూకుడు పెంచింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో అణ్యాయుధాలను రష్యా సేనలు తరలిస్తున్నాయి. అటు బెలారస్‌లో కూడా రష్యా బలగాలు క్షిపణులను మోహరించింది. దీంతో యుద్ధం వాతావరణం నెలకొంది.

రష్యాలో తమ పౌరులకు అమెరికా ఆదేశం
అటు బెలారసర్‌పై అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఆంక్షలు విధించాయి. బెలారస్‌లో ఉన్న తమ ఎంబసీ కార్యకలాపాలను సస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా తెలిపింది. రష్యాలో ఉన్న దౌత్య సిబ్బందిని కూడా వెనక్కి రావాలని సూచించింది. అటు రష్యాలో ఉన్న అమెరికన్లు సైతం తక్షణం స్వదేశానికి వచ్చేయాలని వైట్‌హైస్ ఆదేశించింది.
వైట్‌హౌస్‌కు తాకి సంక్షోభం
రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న సంక్షోభం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను తాకింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా.. ఉక్రెయిన్ వాసులు నిరసనలకు దిగారు. తమ దేశ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ఉక్రెయిన్ కు మద్దతుగా వాషింగ్టన్ డీసీలోని ర్యాలీ చేశారు












Click it and Unblock the Notifications