యుద్ధం నడుమే శాంతి చర్చలు.. నాలుగు నగరాల్లో కాల్పుల విరమణ.. కండీషన్స్ పెట్టిన రష్యా..!!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ దేశ గగనతలాన్ని నోఫ్లైజోన్‌గా ప్రకటించడంతో పాటు ఫైటర్ జెట్లు ఇవ్వాలని అగ్రరాజ్యాలను కోరడంతో రష్యా మరింత రెచ్చిపోతోంది. యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు కోరుతున్నా... రష్యా మాత్రం రాకెట్లతో విరుచుకుపడుతుంది. బాంబులతో విద్వంసం సృష్టిస్తోంది. ఏటు చూసినా భయానకపరిస్థితులే కన్పిస్తున్నాయి.

Recommended Video

    Ukraineలో దారుణ ప‌రిస్థితులు..వెనక్కి తగ్గేది లేదు అంటున్న Putin | Oneindia Telugu
     ఒక‌వైపు యుద్ధం .. మ‌రోవైపు చ‌ర్చ‌లు

    ఒక‌వైపు యుద్ధం .. మ‌రోవైపు చ‌ర్చ‌లు

    ఈ యుద్ధ వాతావరణం కొనసాగుండగానే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. మాస్కో దళాలను ఎదుర్కొవడంలో తాము తగ్గేది లేదంటూనే ఉక్రెయిన్ సేన‌లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. రష్యాతో మూడో విడత చర్చలకు సుముఖతను వ్యక్తం చేస్తోంది. ఇరుదేశాల మరోసారి శాంతి చర్చలకు సిద్ధమయ్యారు. రెండో విడత చర్చల్లో భాగంగా .. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. రష్యా మాత్రం వాటిని పక్కన పెట్టింది. ఏ ప్రాంతంలోనూ దాడులను ఆపలేదు. దీంతో పౌరుల తరలింపు ప్రక్రియకు విఘాతం కలిగింది.

     నాలుగు న‌గరాల్లో కాల్పుల విర‌మ‌ణ‌

    నాలుగు న‌గరాల్లో కాల్పుల విర‌మ‌ణ‌


    సోమవారం మరో విడత రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రటించింది. రాజధాని కీవ్‌తో పాటు సుమీ, మరియూపోల్, సుమీ నగరాల్లో తాత్కాలికంగా కాల్పులను విరమిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం గం. 12.30 నుంచి ఈ కాల్పుల విరమణ మొదలవుతుందని తెలిపింది. అయితే ఈ కాల్పుల విరమణ ఎంత సేపు ఉంటుందనేది మాత్రం పేర్కొనలేదు. ఈ లోపు కారిడార్ల ద్వారా ఈ నాలుగు నగరాల్లో పౌరులను తరలించనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ రిక్వెస్ట్ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

     ర‌ష్యా యుద్ధ విమ‌నం కూల్చివేత‌

    ర‌ష్యా యుద్ధ విమ‌నం కూల్చివేత‌

    మరోవైపు రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది ఖార్కిన్ ప్రాంతంలో ఎగురుతున్న ఎరుగుతున్న విమానాన్ని కూల్చివేయడంతో పైలట్ మృతి చెందినట్లు ఖార్కిన్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ తెలిపింది. ఇది కులినిచివ్ ప్రాంతంలో కూలినట్లు వెల్లడించింది. ఘటనా స్థలంలోనే పెలట్ చనిపోయినట్లు వెల్లడించింది. అటు పోర్టు నగరమైన మికోలాయివ్ రష్యా బాంబులతో దద్దరిల్లుతోంది. ఈ నగరాన్ని స్వాధీం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న రష్యా సేనలకు ఉక్రెయిన్ ఆర్మీ నుంచి తీవ్రంగా ప్రతిఘటన ఎదురవుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+