Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Russia VS Ukraine: శాంతి చర్చల్లో విషప్రయోగం?, రష్యా బిలియనీర్ పరిస్థితి?, రష్యా సైలెంట్, ఉక్రెయిన్ !

ఉక్రెయిన్/రష్యా: ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి, ఇప్పటికే ఉక్రెయిన్ ప్రతిదాడులతో చావు దెబ్బ తింటున్న రష్యా సైనికులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు, ఉక్రెయిన్ ప్రత్యేక ఆపరేష్ ముగిసే వరకు వెనక్కి తగ్గమని రష్యా అంటోంది. రెండు వారాల నుంచి ఉక్రెయిన్-రష్యాల మద్య జరుగుతున్న శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇదే సమయంలో శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యా బిలియనీర్ తో పాటు ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు ప్రముఖుల మీద విష ప్రయోగం జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ నివేదిక విడుదల చెయ్యడం కలకలం రేపింది. శాంతి చర్చల్లో పాల్గొన్న వారి మీద విష ప్రయోగం జరిగిందని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఉక్రెయిన్ అధికారులు కొట్టిపారేశారు. అయితే శాంతిచర్చల్లో పాల్గొన్న వారి మీద విష ప్రయోగం జరిగిందని వస్తున్న వార్తల విషయంలో రష్యా ఇంత వరకు నోరు విప్పలేదు. శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యా బిలియనీర్ తో పాటు ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖులు చికిత్స పొందుతున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ నివేదిక తెలిసింది. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో పాల్గొన్న ప్రముఖుల మీద విష ప్రయోగం జరిగిందని వార్తలు ఇప్పుడు ఆ రెండు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

తగ్గేదే లే అంటున్న ఉక్రెయిన్

తగ్గేదే లే అంటున్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి, ఇప్పటికే ఉక్రెయిన్ ప్రతిదాడులతో చావు దెబ్బ తింటున్న రష్యా సైనికులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు, ఉక్రెయిన్ ప్రత్యేక ఆపరేష్ ముగిసే వరకు వెనక్కి తగ్గమని రష్యా అంటోంది. రష్యా సైనికులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సైనికులు, ఆదేశంలోని కొందరు ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు.

 కొలక్కిరాని శాంతి చర్యలు

కొలక్కిరాని శాంతి చర్యలు

రెండు వారాల నుంచి ఉక్రెయిన్-రష్యాల మద్య జరుగుతున్న శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. టర్కీలోని ఇస్తాంబుల్ లో ఉక్రెయిన్-రష్యా దేశాల మద్య మరోసారి ఈ రోజు (మంగళవారం) శాంతి చర్చలు జరగనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతీన్ తో ముఖాముఖి భేటీలోనే యుద్దం ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ అంటున్నారు.

శాంతి చర్చల్లో విష ప్రయోగం ?

శాంతి చర్చల్లో విష ప్రయోగం ?

ఇదే సమయంలో శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ తో పాటు ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు ప్రముఖుల మీద విష ప్రయోగం జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ నివేదిక విడుదల చెయ్యడం కలకలం రేపింది. ఉక్రెయిన్ లోని కీవ్ లో జరిగిన శాంతి చర్చల సమావేశంలో ఈ విష ప్రయోగం జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో తెలిపింది.

 అక్కడ ఏం జరిగిందంటే ?

అక్కడ ఏం జరిగిందంటే ?

శాంతి చర్చలు జరిగిన తరువాత రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ తో పాటు ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు ప్రముఖుల కళ్లు ఎర్రబడి నీరు ఎక్కువగా కారిందని, శరీరం మీద దద్దులు వచ్చాయని, అందరూ స్వల్ప అనారోగ్యానికి గురైనారని, అయితే సరైన సమయంలో చికిత్స అందించడం వలన వారు కోలుకుంటున్నారని, వారి ప్రాణాలకు ఎలాంటి హానీలేదని వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ నివేదికలో తెలిపింది.

 రష్యా సైలెంట్.... ఉక్రెయిన్ ఫైర్

రష్యా సైలెంట్.... ఉక్రెయిన్ ఫైర్


కీవ్ లో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న వారి మీద విష ప్రయోగం జరిగిందని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఉక్రెయిన్ అధికారులు కొట్టిపారేశారు. అయితే శాంతిచర్చల్లో పాల్గొన్న వారి మీద విష ప్రయోగం జరిగిందని వస్తున్న వార్తల విషయంలో రష్యా ఇంత వరకు నోరు విప్పలేదు. ఉక్రెయిన్ మీద పదేపదే ఆరోపణలు చేస్తున్న రష్యా ఇప్పుడు కీవ్ లో విష ప్రయోగం జరిగిందని వస్తున్న వార్తల విషయంలో సైలెంట్ గా ఉండటం అనేక అనుమానాలకు దారితీస్తోందని సమాచారం.

హాట్ టాపిక్

హాట్ టాపిక్

కీవ్ లో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యా బిలియనీర్ తో పాటు ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖులు కోలుకుంటున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ నివేదిక తెలిసింది. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో పాల్గొన్న ప్రముఖుల మీద విష ప్రయోగం జరిగిందని వార్తలు ఇప్పుడు ఆ రెండు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+