కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ హత్య

ప్రముఖ వైరాలజిస్ట్, కోవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ అయిన స్పుత్నిక్ కోవిడ్ వాక్స్‌ను అభివృద్ధి చేసిన ఆండ్రీ బోటికోవ్ హత్యకు గురయ్యాడు.

మాస్కో: ప్రముఖ వైరాలజిస్ట్, కోవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ అయిన స్పుత్నిక్ కోవిడ్ వాక్స్‌ను అభివృద్ధి చేసిన ఆండ్రీ బోటికోవ్ హత్యకు గురయ్యాడు. మాస్కోలోని తన అపార్ట్‌మెంట్లోకి చొరబడ్డ ఆగంతకుడ్ని అడ్డుకునే క్రమంలో అతను దాడి చేయడంతో ఆండ్రీ చనిపోయాడు. ఈ మేరకు రష్యా మీడియా కథనాలు వెల్లడించాయి.

గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరించిన 18 మంది శాస్త్రవేత్తలలో ఒకరైన ఆండ్రీ బోటికోవ్ మార్చి 2న తన రోగోవా స్ట్రీట్ నివాసంలో చనిపోయినట్లు రష్యన్ వార్తా సంస్థ రెగ్నమ్ వెల్లడించింది. అధికారిక వర్గాలు చనిపోయింది ఆయనేనని ధృవీకరించాయి.
ఆగంతకుడు ఆండ్రీని ఊపిరాడకుండా చేసి చంపాడని పేర్కొన్నాయి.

ఈ ఘటన తర్వాత రష్యాలోని ఇన్వెస్టిగేటివ్ కమిటీ (ఐసీఆర్) హత్యపై దర్యాప్తు ప్రారంభించింది. వాగ్వాదం సందర్భంగా 29 ఏళ్ల వ్యక్తి.. శాస్త్రవేత్తను బెల్టుతో గొంతు నులిమి, ఆపై అక్కడ్నుంచి పారిపోయాడని వారు భావిస్తున్నారు.

Russian Scientist Andrey Botikov Who Developed Sputnik Covid Vax Killed

47 ఏళ్ల ఈ వైరాలజిస్ట్ మరణం ఓ దొంగ చేతిలో జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ.. ఇటీవల కొందరు రష్యాకు చెందిన ప్రముఖ వ్యక్తుల అనుమానాస్పాద మరణాల నేపథ్యంలో ఇది జరగడం చర్చనీయాంశంగా మారింది.

రష్యాలోని ఇన్వెస్టిగేటివ్ కమిటీ మాస్కో విభాగం ఒక ప్రకటనను విడుదల చేసింది. శాస్త్రవేత్తను చంపిన నిందితుడ్ని పట్టుకున్నట్లు తెలిపింది. అయితే, అతడు చంపింది ఆండ్రీనే అనే నిర్ధారణ ఆ ప్రకటనలో చేయకపోవడం గమనార్హం. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది.

ఆండ్రీ బోటికోవ్.. రష్యన్ కోవిడ్ వ్యాక్సిన్

ఆండ్రీ బోటికోవ్ 2014 నుంచి గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్‌లో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారని న్యూస్‌వీక్ తెలిపింది. ఆయన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే బాధ్యత కలిగిన బృందంలో ఒకడు, ఇతర వ్యాక్సిన్‌ల కంటే దీనికి 91% క్లినికల్ ట్రయల్ ఎఫిషియసీ చాలా ఎక్కువగా ఉందని రష్యా పేర్కొంది. కాగా, భారతదేశంలోనూ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉపయోగంలో ఉన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+