• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సవతి కొడుకుతో గర్భం.. ఆపై వివాహం.. సోషల్ మీడియా స్టార్ మెరీనా సంచలనం.. కరోనాకు దీటుగా ట్రెండ్..

|

''జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం. మనల్ని బాగా సంతోషపెట్టే వ్యక్తిని ఎలా కలుస్తారనేది విచిత్రంగానే జరగొచ్చు. ప్రస్తుతం నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అంతే గందరగోళంగానూ అనిపిస్తోంది. ఈ వీడియోలో మీరు.. ఇద్దరు వెర్రివాళ్లను చూస్తున్నారు. ఎట్టకేలకు మేం భార్యాభర్తలయ్యాం. నాకు తెలుసు.. చాలా మంది దీన్ని జీర్ణించుకోలేకపోవచ్చు.

ఇంకొంతమంది మా నిర్ణయాన్ని సమర్థించనూ వచ్చు. ఏది ఏమైనా, ఎవరు ఏమనుకున్నా మేం సంతోషంగా ఉన్నాం. మీరందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాం..'' అంటూ తన నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్లను ఉద్దేశించి ఇన్‌స్టాలో మెరీనా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో, ఆమెకు సంబంధించిన విషయాలు కరోనా వార్తలకు దీటుగా ట్రెండ్ అవుతున్నాయిప్పుడు.

షాకింగ్: హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతికి కరోనా.. తెలంగాణలో కొత్తగా 1676 కొత్త కేసులు, 10 మరణాలు..

సోషల్ స్టార్ బల్మషేవా..

సోషల్ స్టార్ బల్మషేవా..

ఆమె పేరు మెరీనా బల్మషేవా. వయసు 35. ఊరు పశ్చిమ రష్యాలోని క్రష్నొడాస్కీ. డెయిలీ రొటీన్, పిల్లల పెంపకం, మోటివేషన్ తదితర వీడియోలు, ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులరైంది. ప్రస్తుతం నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్లున్నారామెకు. తన 22వ ఏట(2007లో) మెరీనా.. అలెక్సీ షవ్రీన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అప్పటికే అతనికి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. ఆ తర్వాత ఇంకో మగ్గురు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. పిల్లల ఆలనాపాలనా చూసుకున్న మెరీనా.. అందులో ఒకరితో పీకల్లోతు ప్రేమలోపడిపోయింది. అసహజంగా అనిపించినా ఇది నిజం.

భర్తకు విడాకులు.. కొడుకుతో డేటింగ్..

భర్తకు విడాకులు.. కొడుకుతో డేటింగ్..

అలెక్సీతో మెరీనా వివాహ బంధం 10ఏళ్లకే తెగిపోయింది. 2017లో వాళ్లిద్దరూ చట్టబద్ధంగా విడిపోయారు. ఐదుగురు పిల్లల్లో పెద్దోడు వ్లాదిమిర్‌ వోయా మేజర్ కాగా, మిగతావాళ్ల బాధ్యతలను తండ్రికి కట్టబెడుతూ కోర్టు తీర్పు చెప్పింది. వాళ్లు విడిపోయే సమయానికి వ్లాదిమిర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. భర్తకు విడాకులిచ్చిన వెంటనే మెరీనా.. తన సవతి కొడుకైన వ్లాదిమిర్ తో డేటింగ్ మొదలుపెట్టింది. కొన్ని నెలల సహజీవనం తర్వాత తమ మధ్య బంధాన్ని ఆమెనే బహిర్గతం చేసింది. ఇప్పుడామె గర్భవతి కావడంతో మూడ్రోజుల కిందట పెళ్లి కూడా చేసేసుకున్నారు. 20 ఏళ్ల వ్లాదిమిర్, 35ఏళ్ల మెరీనా చట్టబద్ధంగా భార్యాభర్తలయ్యారు. పెళ్లి తాలూకు వీడియోను షేర్ చేస్తూ భావోద్వేగ ప్రకటన చేశారామె. అయితే..

అనూహ్యం: జగన్ బాటలో మోదీ ఇలాకా.. ప్రధాని భార్యను తిట్టిన నోటితో ఇలా.. సాయిరెడ్డి శైలిలో..

కొడుకును కలిసిన తొలిసారి అలా..

కొడుకును కలిసిన తొలిసారి అలా..

సవతి కొడుకుతో మెరీనా పెళ్లి వ్యవహారం రచ్చకెక్కడానికి ఆమె షోషల్ మీడియా స్టార్ కావడం ఒక కారణమైతే.. ‘‘తనను మొదటిసారి కలిసినప్పుడు.. ''అంటూ ఆమె షేర్ చేసిన ఓ ఫోటో కూడా మరో కారణమైంది. 13 ఏళ్ల కిందట అలెక్సీని పెళ్లాడిన తర్వాత అతని కొడుకు వ్లాదిమిర్(అప్పుడతనికి 7ఏళ్లు) తో కలిసి దిగిన ఫొటోను మెరీనా బయటపెట్టింది. దీనిపై ఆమె ఫాలోవర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘మనం పెంచిపెద్ద చేసిన పిల్లలతో ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం సరికాదేమో, మీరిలా బహిరంగ ప్రదర్శనక దిగడం అసలు బాగోలేదు..'' తరహాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే..

  COVID-19 : ‘కరోనా వ్యాక్సిన్’ డేటా ను Russia దొంగతనం చేసిందా ? || Oneindia Teludu
  కొడుకును లొంగదీసుకుంది..

  కొడుకును లొంగదీసుకుంది..

  మెరీనా-వ్లాదిమిర్ పెళ్లి వ్యవహారంపై ఆమె మాజీ భర్త(వ్లాదిమిర్ తండ్రి కూడా అయిన) అలెక్సీ తీవ్రంగా స్పందించారు. మాజీ భార్యపై నిప్పులు చెరిగారు. తాము కలిసున్న రోజుల్లోనే కొడుకును లైంగికంగా లొంగదీసుకుందని, ఇప్పుడేకంగా పెళ్లి చేసుకోవడం దారుణమని ఆయన వాపోయారు. ‘‘మా బెడ్ రూమ్ పక్కనే వ్లాదిమిర్ గది ఉండేది. మెరీనా రోజూ రాత్రి సైలెంట్ గా అక్కడికి వెళ్లొచ్చేది. ఓ రోజు వాళ్ల వ్యవహారం నా కంటపడింది. వ్లాదిమిర్ స్థానంలో వేరే ఎవరున్నా నేను ఆమెను క్షమించేవాడినే. తన మాయలో నుంచి వాడు బయటపడాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు చేసేదేమీలేదు'' అని అలెక్సీ చెప్పుకొచ్చాడు. అతని స్టేట్మెంట్ నిజమైతే, మైనర్ బాలుడపై లైంగిక అకృత్యం కింద మెరీనాపై కేసు పడాలి. కానీ అలాంటిదేమీ జరగకపోవడం గమనార్హం. ప్రస్తుతం మెరీనా-వ్లాదిమిర్ జంట తమకు పుట్టబోయే పాప కోసం కలలు కంటున్నారు. ఇంకో ముగ్గురు పిల్లల్ని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు.

  English summary
  A Russian influencer Marina Balmasheva, 35, has married her 20-year-old stepson after divorcing his father, and has announced they are expecting their first baby. But instead of persuading people to support her, attracted a storm of protest when she shared the before-and-after photo on Instagram with her 420,000 followers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X