మహిళ నగ్న మృతదేహం: మాంసం కోసం దారుణంగా చంపేశారు..
రష్యాలోని ఓ పట్టణంలో గుర్తు తెలియని యువతి హత్యకు గురవడం కలకలం రేపుతోంది. మాంసం కోసమే యువతిని హత్య చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి.ఈ హత్యతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
మాస్కో: రష్యాలోని ఓ పట్టణంలో గుర్తు తెలియని యువతి హత్యకు గురవడం కలకలం రేపుతోంది. మాంసం కోసమే యువతిని హత్య చేసినట్లుగా ఆనవాళ్లు ఉండటం స్థానికులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది.
నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం పక్కన సర్జన్ వినియోగించే గ్లౌజులు దొరకడంతో.. వైద్యుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాంసం కోసం అమ్మాయిని హత్య చేశారన్న వార్త రష్యన్ మీడియాలో ప్రసారమవడంతో.. అక్కడి ప్రజలను భయం వెంటాడుతోంది. కత్తితో యువతి శరీర భాగాలను కోసినట్లుగా మృతదేహంపై ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

ఒంటరిగా వెళ్లేందుకు మహిళలు, బాలికలు జంకుతున్నారు. మనిషి రక్త మాంసాలకు అలవాటుపడిన సదరు వ్యక్తిని త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు. కాగా, రష్యా ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications