Russia Offer: అమెరికాతో ఒప్పందం.. రష్యా ఆఫర్.. భారత్ ఏం చేస్తుంది?

Russia Offer: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. ఇది రష్యాకు పెద్ద దెబ్బ కావచ్చు. శుక్రవారం వైట్ హౌస్ లో ప్రధాని మోడీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా త్వరలో భారత్ కు అగ్రశ్రేణి చమురు, గ్యాస్ సరఫరాదారుగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతలో రష్యా భారత్ కు పోటీ ధరకు గ్యాస్ కొనుగోలు చేయడానికి ఆఫర్ ఇచ్చింది.

రష్యా డిప్యూటీ ఎనర్జీ మంత్రి పావెల్ సోరోకిన్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యా ద్రవీకృత సహజ వాయువు(LNG)కు పెద్ద మార్కెట్ అని అన్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా తన సహజ వాయువు ఉత్పత్తిని ఎగుమతులను పెంచుకుంటోందని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ లో ఆయన మాట్లాడుతూ. ఇంతకు ముందు భారత్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి తగినంత ద్రవీకృత సహజ వాయువు రష్యా దగ్గర లేదని.. కానీ ఇప్పుడు ఇలా కాదన్నారు. ఇప్పుడు మా ఎల్ఎన్జీ మార్కెట్ ను విస్తరిస్తున్నామని.. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామన్నారు. భారత్ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా మారుతుందని ఆశిస్తున్నామన్నారు. రష్యాపై అమెరికా, దాని మిత్రదేశాలు ఆంక్షలు పెంచుతున్నప్పటికీ.. రష్యా తన భాగస్వాములతో వాణిజ్యాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు. రష్యా భారత్ కు తక్కువ ధరలకు ఎగుమతి చేస్తుందని కూడా ఆయన చెప్పారు. ఆంక్షల వంటి చట్టవిరుద్ధమైన పద్ధతులను కలిగి ఉండనంత వరకు తాము స్వేచ్ఛా మార్కెట్లో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Russia s Offer to India on Gas A Strategic Decision Amid US Deal
భారత్ ఏ దేశాల నుంచి సహజవాయువును కొనుగోలు చేస్తుంది?
భారత్ తన సహజ వాయువు అవసరాలలో 50 శాతం దిగుమతి చేసకుంటుంది. భారత్ కు గ్యాస్ ఎగుమతి చేసే దేశాలలో ఖతార్, అమెరికా అగ్రస్థానంలో ఉన్నాయి. 2013-30 మధ్య భారత్ సహజ వాయువు వినియోగం 60 శాతం పెరుగుతుందని అంచనా. అటువంటి పరిస్థితిలో దేశీయ అవసరాలను తీర్చడానికి భారత్ గ్యాస్ దిగుమతులను పెంచాల్సి ఉంటుంది. భారత్ ప్రస్తుతం ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవడానికి ఏడు ఎల్ఎన్జీ టెర్మినల్స్ ను కలిగి ఉంది. వీటి సామర్థ్యం సంవత్సరానికి దాదాపు 47.7 మిలియన్ మెట్రిక్ టన్నులు. భారత్ లో ఎల్ఎన్జీకి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఎగుమతులను పెంచాల్సి ఉంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ చెబుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ ఎగుమతిదారులలో ఒకటైన రష్యా.. గత సంవత్సరం రికార్డు స్థాయిలో 33.6 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని విక్రయించింది. అందులో సగానికి పైగా యూరోపియన్ యూనియన్ కు విక్రయించిందని విశ్లేషకులు వెల్లడించారు.

అమెరికాతో ఒప్పుందం.. రష్యా ఆఫర్.. భారత్ ఏ వైపు?
గురువారం నాడు అమెరికా, భారత్ మధ్య చమురు, గ్యాస్క కు సంబంధించి ఒక ఒప్పందం కుదిరిన సమయంలో రష్యా గ్యాస్ కు సంబంధించి ఈ ఆఫర్ వచ్చింది. భారత్ తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని రష్యా నుంచే కొనుగోలు చేస్తుంది. అమెరికా రష్యాను భర్తీ చేయాలని కోరుకుంటోంది. ఈ ఒప్పందం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ అమెరికా నుంచి గరిష్టంగా చమురు, గ్యాస్ కొనుగోలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశం తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా నుంచి మనం దాదాపు 15 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఓ వైపు అమెరికా భారత్ కు అగ్రశ్రేణి చమురు, గ్యాస్ సరఫరాదారుగా ఎదగాలని కోరుకుంటుండగా.. మరోవైపు రష్యా భారత్ కు సాపేక్షంగా తక్కువ ధరలకు చమురును అందిస్తోంది. తక్కువ ధరలకు గ్యాస్ ను కూడా అందిస్తోంది. ఇది భారత్ తు లాభదాయకమైన ఒప్పందం కావచ్చు. అమెరికా, రష్యాలతో పోటీపడితే భారత్ చౌక ధరలోనే గ్యాస్ పొందగలదు. అటు అమెరికా, ఇటు రష్యాలతో భారత్ కు లాభం చేకూరే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+