చారిత్రక దినం: తొలిసారి ఓటు వేసిన సౌదీ మహిళలు
రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు తొలిసారి ఓటు వేసి చరిత్ర సృష్టించారు! సౌదీ అరేబియాలో శనివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ దేశ మహిళలు మొట్టమొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు మొదటిసారి పోటీ చేయడం మరో విశేషం. శరీరం ఏమాత్రం కనిపించకుండా దుస్తులు ధరించాలనే నిబంధన ఉన్న సౌదీ అరేబియా... కేవలం పురుషులకు మాత్రమే ఓటు హక్కును కల్పించిన ఆఖరి దేశం.
ఇప్పుడు సౌదీ అరేబియా మహిళలు ఓటు వేయడంతో పాటు ఎన్నికల్లోను పోటీ చేశారు. ఈ స్థానిక ఎన్నికల్లో 978 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. 5,938 మంది పురుషులు బరిలో నిలిచారు. 1,30,000 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలకు, పురుషులకు పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications