భూమికి దగ్గరగా దూసుకెళ్లిన బాహుబలి గ్రహ శకలం: ఫొటోలు తీసిన నాసా

Recommended Video

    Scientists Capture Incredible Photo Asteroid 2000 QW7 Which Skimmed Past Earth || Oneindia Telugu

    న్యూయార్క్: బుర్జ్ ఖలీఫా తెలుసు కదా! దుబాయ్ లో నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తయిన భవనం ఇది. దీని ఎత్తు 830 అడుగులు. దీనికంటే ఎత్తు, సుమారు 300 మీటర్ల వైశాల్యం గల ఓ గ్రహ శకలం భూమికి అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. దీని పేరు 2000 క్యూడబ్ల్యూ 7. భూగోళానికి దగ్గరగా అత్యంత సమీపంలో అంటే ..3 లక్షల 30 వేల కిలోమీటర్ల దూర నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లిందీ బాహుబలి గ్రహ శకలం. వినడానికి 3 లక్షల 30 వేల కిలోమీటర్లే అయినప్పటికీ.. అంతరిక్ష పరిశోధకులు, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఇది అత్యంత సమీపం. భూమిని దాటే సమయంలో దాని వేగం అనూహ్యం. గంటకు 14,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వెల్లడించింది.

    దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తీసింది. అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం సాయంత్రం 5:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంతరిక్షంలో పరిభ్రమిస్తూ మరోసారి భూమి వైపు దూసుకొచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని వారు అంచనా వేశారు. అంతరిక్షంలోకి వెళ్లిపోయిన ఆ గ్రహ శకలం మళ్లీ భూమి వైపు రావడానికి కనీసం వంద సంవత్సారలకు సమయం పట్టొచ్చిన అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో శబ్దం ప్రయాణించదు. శబ్దమే ప్రయాణించి ఉన్నట్టయితే.. 2000 క్యూడబ్ల్యూ 7 గ్రహ శకలం దూసుకెళ్లిన సమయంలో జూమ్ అంటూ వెలువడిన శబ్దాన్ని భూమ్మీద నివసిస్తోన్న ప్రతి ప్రాణీ వినగలిగి ఉండేదట.

    Scientists Capture Incredible Photo Asteroid 2000 QW7 Which Skimmed Past Earth

    కెనడాలోలో నాసాకు చెందిన సోలార్ సిస్టమ్ టెలిస్కోప్ ద్వారా 2000 క్యూడబ్ల్యూ 7 ఫొటోలను తీశారు. అంతరిక్షానికి సంబంధించిన కథనాలను మాత్రమే ప్రచురించే అమెరికాకు చెందిన ఓ వెబ్ సైట్ ఈ గ్రహ శకల గమనాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసింది. భూమిపై జీవించిన డైనోసార్లు అంతం కావడానికి కారణమైన గ్రహ శకలానికి కనీసం అయిదు రెట్లు అధికంగా ఉండే 2000 క్యూడబ్ల్యూ 7 భూమిని ఢీ కొట్టి ఉంటే సంభవించే ఉత్పాతాన్ని మాటల్లో వర్ణించలేమని పాల్ కాక్స్ అనే అంతరిక్ష పరిశోధకుడు అభిప్రాయ పడ్డారు. ఈ గ్రహ శకలం మళ్లీ వెనక్కి తిరిగి రాదనే గ్యారంటీ ఎంత మాత్రం లేదని, ఎప్పుడో ఒకసారి ఇది మళ్లీ భూమి వైపు రెట్టింపు వేగంతో దూసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని అన్నారు. 2038లో ఇదే అస్టరాయిడ్ మరోసారి భూగోళం వైపు రావచ్చని పాల్ కాక్స్ తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+