గ్రేట్: బ్రిటీష్ పోలీసు వ్యవస్థ మొత్తం.. ఇక ఓ మహిళ చేతిలో..

దాదాపు 187 సంవత్సరాల తరువాత స్కాట్లండ్ యార్డ్ కమిషనర్ గా క్రెస్సిడా డిక్ అనే మహిళను నియమిస్తున్నట్లు బ్రిటన్ హోమ్ సెక్రటరీ అమ్ బెర్ రుడ్ ప్రకటించారు.

లండన్: దాదాపు 187 సంవత్సరాల తరువాత స్కాట్లండ్ యార్డ్ కమిషనర్ గా ఒక మహిళను నియమిస్తున్నట్లు బ్రిటన్ హోమ్ సెక్రటరీ అమ్ బెర్ రుడ్ ప్రకటించారు. క్రెస్సిడా డిక్ ను ఆ పదవికి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

క్రెస్సిడా డిక్ ఇప్పటికే లండన్ ప్రభుత్వంలో అత్యున్నత పదవిని నిర్వహిస్తున్నట్లు హోమ్ సెక్రటరీ తెలిపారు. ఇకమీదట బ్రిటీష్ అతి పెద్ద పోలీసు వ్యవస్థ మొత్తం ఒక మహిళ నిర్వహించబోతున్నారని ఆయన అన్నారు.

 Scotland Yard, Britain’s Biggest Police Force, Is Now Led by a Woman

ఈ సందర్భంగా అమ్ బెర్ రుడ్ మాట్లాడుతూ.. ''క్రెస్సిడా ఒక శక్తిమంతమైన మహిళ. ఆమెకు పోలీసు వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. ఆమె తన బాధ్యతలను అద్భుతంగా నెరవేరుస్తారు..'' అని వ్యాఖ్యానించారు.

లండన్ మేయర్ సాధిక్ ఖాన్ మాట్లాడుతూ.. '' ఆమె సమర్థవంతమైన నాయకురాలు.. లండన్ చరిత్రలో 187 సంవత్సరాల తరువాత ఒక మహిళను కమిషనర్ గా ఎంపిక చేయడం అభినందనీయం..'' అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+