ఉక్రెయిన్ లో యుద్ధానికి ముగింపు-ముహుర్తం ఖరారు చేసిన రష్యా-నాజీలపై విజయోత్సవ దినాన
ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దండయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. ఉక్రెయిన్ భూభాగం శవాల దిబ్బగా మారిపోతోంది. అయినా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలాగని ఈ పోరులో రష్యా గెలిచే పరిస్ధితులు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. అంతే కాదు రష్యా భారీగా ఆయుధాల్ని, సైనికుల్ని, మందుగుండును కూడా కోల్పోయింది. దీంతో త్వరలో యుద్ధం ముగీంచే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తాజాగా ముహుర్తం కూడా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

రష్యాకు ఎదురుదెబ్బలు
ఉక్రెయిన్ లో రష్యాకు ఎదురుదెబ్బలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ పంపిన సైన్యంలో 15 వేల మందికి పైగా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ దెబ్బలు పైకి కనిపిస్తుంటే రష్యాకు తగిలిన దెబ్బలు మాత్రం లోలోపల కుమిలిపోయేలా ఉన్నాయి. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలను ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. అయినా రష్యా పట్టు వీడేలా లేదు. ఇప్పటికే తలుగుతున్న ఎదురుదెబ్బలతో రష్యా అసహనం పెరుగతోంది. దీంతో ఉక్రెయిన్ పై అణుప్రయోగం కూడా చేస్తుందేమోనన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు
ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ముగించాలని అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఈ యుద్ధాన్ని తప్పుపడుతున్నాయి. పశ్చిమదేశాలతో పాటు నాటో, ఈయూ దేశాలు కూడా యుద్ధానికి దిగిన రష్యాను కట్టడిచేసేందుకు భారీ ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా జీ7, జీ20 కూటముల నుంచి రష్యాను బహిష్కరించేందుకు సైతం ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతే కాదు ఐరాస శాశ్వత సభ్యదేశాల గ్రూప్ నుంచి కూడా రష్యాను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా ఉక్రెయిన్ లో రష్యా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతోనే సాగుతున్నాయి.

ఉక్రెయిన్ ఆర్మీ సంచలన ప్రకటన
ఉక్రెయిన్ లో రష్యా సాగిస్తున్న యుద్దానికి ముగింపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఆర్మీ అంచనా ప్రకారం త్వరలోనే రష్యా ఈ యుద్ధాన్ని ముగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యుద్ధంలో భారీగా మందుగుండు, ఆయుధాలు, సైనికుల్ని కోల్పోయిన రష్యా.. ఇకపై యుద్ధం కొనసాగితే ఇంటా బయటా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున యుద్ధం ముగింపుకు సిద్దమవుతున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలు తాజాగా ఓ ప్రకటన చేశాయి. దీంతో ఈ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది.

మే 9న యుద్ధం ముగుస్తుందా ?
మే 9న రష్యా యుద్ధాన్ని ముగించే అవకాశమున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పటి కల్లా ఉక్రెయిన్ లో రష్యా కోరుకున్న విధంగా టార్గెట్లు విధ్వంసం కావడం ఖాయం. దీంతో మే 9న యుద్ధాన్ని ముగించేందుకు రష్యా సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. కీవ్ ఇండిపెండెంట్ పత్రిక నివేదిక ప్రకారం, ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం మేరకు మే 9 నాటికి యుద్ధం ముగియాలని రష్యా దళాలకు పుతిన్ ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని తెలుస్ోతోంది. నాజీ జర్మనీపై విజయం సాధించిన రోజుగా రష్యాలో మే 9న విజయోత్సవాలు జరుపుతుంటారు. ఇప్పుడు అదే రోజు ఉక్రెయిన్ పై యుద్దాన్ని కూడా ముగించేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications