భారత్ పక్కలో బల్లెం దింపాడయ్యో

అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో చోటు చేసుకుంటోన్న మార్పులు.. భారతీయ విద్యార్థులను దెబ్బకొడుతున్నాయి. వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశలను నీరుగారుస్తోన్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయ విద్యార్థులే అధికంగా బలి అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చింది అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ. భారత్ సహా వివిధ దేశాలవారికి జారీ చేసిన విసాలపై కొత్త నిబంధనలను ప్రకటించింది. సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను సమీక్షిస్తోన్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా నిరంతర తనిఖీలు ఉంటాయని పేర్కొంది.

Sergio Gor appointed as the next Ambassador to India

ఈ పరిస్థితుల మధ్య మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత రాయబారిగా సెర్గియో గోర్ అపాయింట్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది. భారత్ అమెరికా రాయబార కార్యకలాపాలతో పాటు దక్షిణాసియా, మధ్య- ఆసియా వ్యవహారాల ప్రత్యేక దూతగా ఆయన వ్యవహరిస్తారు.

ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. సెర్గియో గోర్‌ను భారత రాయబారిగా నియమించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్ దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. సెర్గియో గోర్ ను తనకు గ్రేట్ ఫ్రెండ్ గా అభివర్ణించారు ట్రంప్.

భారత్‌కు రాయబారిగా, దక్షిణాసియా, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక దూతగా నియమితులైనందుకు అభినందనలు అని వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ డైరెక్టర్‌, హెడ్ ఆఫ్ ది సివిల్ స్టాఫ్ గా సెర్గియో అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు. ఆయన సారథ్యంలో అడ్మినిస్ట్రేషన్ లోని ప్రతి విభాగంలో అతి తక్కువ సమయంలో దాదాపు 4,000 మంది అమెరికా ఫస్ట్ పేట్రియాట్స్‌ నియమితులయ్యారని పేర్కొన్నారు.

సుదీర్ఘకాలంగా డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత నమ్మకస్తుడిగా, విధేయుడిగా పేరుంది సెర్గియోకు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. వైట్ హౌస్ సివిల్ స్టాఫ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు భారత్ కు రాయబారిగా అపాయింట్ అయ్యారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ సహా దక్షిణ- మధ్య ఆసియా రీజియన్ లో అమెరికా అజెండాను పూర్తి చేయడానికి, MAKE AMERICA GREAT AGAIN అయ్యేలా సహాయపడటానికి సెర్గియోపై పూర్తిగా విశ్వసించానని ట్రంప్ పేర్కొన్నారు. సెర్గియో ఓ అద్భుతమైన రాయబారి అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+