ఉగ్రవాదుల మరో మారణహోమం- పలువురు మృతి
Canada Terror Attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
అదే సమయంలో కెనడాలో భారీ దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. మారణహోమం సృష్టించారు. ఈ దాడి కోసం కారును ఉపయోగించారు. జనసమ్మర్థంపై ఇష్టారాజ్యంగా కారును నడిపారు. కారుతో తొక్కించి చంపేశారు. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు. ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరావట్లేదు. ఈ ఘటన మరోమారు ప్రపంచ దేశాలను నిర్ఘాంతపోయేలా చేసింది.

కెనడా కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటల సమయంలో 41వ అవెన్యూ ఫ్రేజర్ వద్ద ఈ ఘోర కలి చోటు చేసుకుంది. వాంకోవర్‌లో ఓ కార్నివాల్ కొనసాగుతున్న సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కారుతో దూసుకొచ్చాడు. ఇష్టారీతిన కారును నడిపించాడు. కార్నివాల్‌లో పాల్గొన్న వారిపై కారును ఉరికించాడు.
ఈ ఘటనలో పలువురు మరణించారు. ఎంతమంది ఈ ఘోరానికి బలి అయ్యారనేది ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు. పలువురు మృతిచెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
కెనడా ఫ్రేజర్ టౌన్ పరిసరాల్లో సూర్యాస్తమయానంతరం లాపు లాపు పేరుతో ప్రత్యేక వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఫిలిప్పీన్స్ కమ్యూనిటీ మెంబర్స్ ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికులు ఉత్సాహంగా లాపులాపు వేడుకలను తిలకిస్తన్న సమయంలో గుమిగూడిన సమయంలో ఇష్టారాజ్యంగా కారు.నడింపాడు డ్రైవర్.
ఓ వ్యక్తి తన కారును జనంపైకి ఇష్టానుసారంగా కారును నడపించాడు. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను అక్కడి పోలీసులు నిమిషాల వ్యవధిలో గుర్తించారు. ఆరా తీశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తు ముగిసే కొద్దీ తాము మరిన్ని వివరాలను అందిస్తామని చెప్పారు. ఇది కారు దాడినా లేక ప్రమాదమా అనేది పోలీసులు ఇప్పటివరకు నిర్ధారించలేదు. ఉద్దేశపూరకంగానే కారును జనంపైకి నడిపించి ఉడొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఘటన తరువాత పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఇది ఉగ్రవాదుల పనేనని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.












Click it and Unblock the Notifications