అమెరికాపై టెర్రర్ అటాక్- షాపింగ్ మాల్ లో..
Colarado attack: అమెరికాపై ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. కొలరాడోలోని ఓ మాల్ పై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదని పోలీసులు వెల్లడిాంచారు.
ఇది- ఉగ్రవాద చర్యగా ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్దారించింది. దీన్ని ఉగ్రదాడిగా భావిస్తోన్నామని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఎఫ్బీఐ ఏజెంట్లు రంగంలోకి దిగారని, స్థానిక పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు మొదలుపెట్టారని వివరించారు.

కొలరాడో బౌల్డర్ లో గల పెరల్ స్ట్రీట్ మాల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1:26 నిమిషాలకు ఈ దాడి సంభవించింది. పెరల్ స్ట్రీట్ మాల్ లో ఓ సెలబ్రేషన్ లో పాల్గొన్న పాలస్తీనియన్లపై ఓ వ్యక్తి మొలొటొవ్ కాక్ టెయిల్ వంటి కెమికల్ ను చల్లాడు. దీన్ని ఫైర్ బాంబ్స్ గా ఆ తరువత పోలీసులు నిర్ధారించారు.
రెండు పెద్ద బాటిళ్లతో అతను సంఘటనస్థలానికి చేరుకోవడం, హఠాత్తుగా అక్కడున్న వాళ్లపై దీన్ని చల్లడానికి సంబంధించిన వీడియోలు విడుదల అయ్యాయి. ఈ ఘటనలో పలువురికి కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని ఇజ్రాయెల్ మద్దతుదారుడిగా భావిస్తోన్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తూ ఈ దాడికి దిగినట్లు బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్ ఫియర్న్ వెల్లడించారు. బందీలకు సంఘీభావం తెలియజేస్తూ బౌల్డర్ లో రన్ ఫర్ దెయిర్ లైవ్స్ పేరుతో నిర్వహించిన ఓ ర్యాలీలో అతను పాల్గొన్నాడని చెప్పారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నామని, విచారణ మొదలు పెట్టామని స్టీఫెన్ చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో ఎఫ్బీఐ కూడా భాగస్వామ్యం అయిన విషయాన్ని ఆయన నిర్ధారించారు. ఇది ఉగ్రవాద చర్యగా ఎఫ్బీఐ భావిస్తోందని తెలిపారు.
నిందితుడిని 45 సంవత్సరాల మహ్మద్ సబ్రీ సోలిమన్ గా గుర్తించామని డెన్వర్ ఎఫ్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ అండ్ స్పెషల్ ఏజెంట్ మార్క్ మిఖాలెక్ వెల్లడించారు. ఈ దాడిలో మొత్తం ఆరుమంది గాయపడ్డారని, 45 నుంచి 88 సంవత్సరాలలోపు ఉన్నవాళ్లేనని అన్నారు. దీన్ని ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తోన్నామని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై ఆరా తీస్తోన్నట్లు తెలిపారు.
NEW: Colorado police respond to an attack at the Pearl Street Mall in Boulder, Colorado.
— Collin Rugg (@CollinRugg) June 1, 2025
According to witnesses who spoke with CBS, the suspect attacked people walking to remember the Israeli hostages.
“This is not a protest; it is a peaceful walk to show solidarity with the… pic.twitter.com/9RNETljAIM
ఈ ఘటనపై కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ స్పందించారు. బౌల్డర్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉగ్రవాద చర్య వల్ల గాయపడిన వారికి సంఘీభావాన్ని తెలియజేశారు. ద్వేషపూరక చర్యలను ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని అన్నారు. ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి దర్యాప్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
🚨 After trying to burn Jews alive in Boulder, Colorado today, Mohamad Soliman ranted about “children being killed” and “Until Palestine is free.”
— Jews Fight Back 🇺🇸🇮🇱 (@JewsFightBack) June 1, 2025
You read that right.
He firebombed Jews—then played the victim.
This is the twisted ideology of Palestinianism:
Attack Jews, then… pic.twitter.com/Rx9QmtMTar
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications