పాకిస్తాన్‌లో భారీ పేలుడు- పలువురి దుర్మరణం: జర్నలిస్టులకూ తీవ్రగాయాలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

గిరిజనులు, ఆదివాసీలు అధికంగా నివసించే ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కొద్దిసేపటి కిందటే ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రావిన్స్‌లోని ఖర్ జిల్లా కేంద్రం బజౌర్‌లో ఈ సాయంత్రం ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

Several were killed and others injured in a blast in Pakistan

సంఘటన స్థలం మొత్తం రక్తసిక్తమైంది. భయానకంగా కనిపించింది. పోలీసు వాహనాలు, అంబులెన్సుల సైరన్ల మోతలతో ఈ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది. పేలుడు సంభవించిన వెంటనే దట్టమైన పొగ వెలువడింది. మంటలు చెలరేగాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది.

ఈ మధ్యాహ్నం బజౌర్‌లో జమాత్-ఎ-ఉలేమా-ఫజల్ పార్టీ కార్యకర్తలు సమావేశం అయ్యారు. అనేక అంశాలపై చర్చించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించింది. ఈ సమావేశానికి పార్టీ చీఫ్ హఫీజ్ హమ్దుల్లా హాజరు కావాల్సి ఉంది. ఆయన రావడానికి కొద్ది నిమిషాల ముందు పేలుడు సంభవించింది.

ఈ సమావేశాన్ని కవర్ చేయడానికి వెళ్లిన పలువురు జర్నలిస్టులు కూడా ఈ పేలుడులో గాయపడ్డారు. ఈ ఘటన వెనుక గల కారణాలేమిటనే విషయంపై ఆరా తీస్తోన్నామని ఖర్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఉగ్రవాద చర్య కోణంలో దర్యాప్తు సాగిస్తామని పేర్కొన్నారు. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి దీన్ని ఉగ్రవాదుల ఘాతుకంగా భావించట్లేదని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+