అమెరికాలో భారీ ప్రమాదం.. గ్రేట్ టన్నెల్ కొలాప్స్
అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ భారీ టన్నెల్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిని వెలికి తీయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు స్థానిక అధికారులు. దీనికోసం అత్యాధునిక పరికరాలను వినియోగిస్తోన్నారు.
కాలిఫోర్నియాలో ఈ దుర్ఘటన సంభవించింది. లాస్ ఏంజిలిస్ శివార్లలోని విల్మింగ్టన్ లో నిర్మాణంలో ఉన్న టన్నెల్ ఇది. విల్మింగ్టన్ లోమిటా బోల్వార్డ్ నుంచి సౌత్ ఫిగోరియా స్ట్రీట్ ను కనెక్ట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ భారీ టన్నెల్ ను నిర్మిస్తోంది. ఎప్లూయెంట్ అవుట్ ఫాల్ టన్నెల్ ఇది.

తాజాగా ఇది కుప్పకూలింది. అమెరికా కాలమానం ప్రకారం.. రాత్రి 8:55 నిమిషాల ప్రాంతంలో కొంతమంది కార్మికులను క్రేన్ సహాయంతో పైకి తీసుకు వస్తోన్న సమయంలో అది తెగిపోయింది. లాస్ ఏంజిల్స్ కౌంటీ శానిటేషన్ డిస్ట్రిక్ట్ క్లియర్ వాటర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇది నిర్మితమౌతోంది. 2027 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. 2028 జనవరి నాటికి అందుబాటులోకి రావాల్సి ఉంది.
దీనికోసం వందలాదిమంది కార్మికులు పని చేస్తోన్నారు. తాజా ప్రమాదంలో 15 నుంచి 28 మంది వరకు కార్మికులు ఇందులో చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడటానికి అధికారులు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోన్నారు. దీనికి అవసరమైన కొన్ని రేడియో కమ్యూనికేషన్లను పంపించారు. వాటికి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం అందలేదని లాస్ ఏంజిలిస్ ఫైర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. ఈ సొరంగం కూలిపోవడం వల్ల కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు.
ఫైర్ డిపార్ట్ మెంట్ అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లతో రంగంలోకి దిగింది. కార్మికులను సురక్షితంగా వెలికి తీయడానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తోంది. ఈ టన్నెల్ కు ఒకే ఒక్క దారి ఉండటం వల్ల వారిని బయటికి తీసుకుని రావడం కష్టతరమౌతోంది.
సౌత్ ఫిగోరియా స్ట్రీట్ వైపు నుంచి మాత్రమే ఈ టన్నెల్ లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. సొరంగం ప్రవేశ మార్గం నుండి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని లాస్ ఏంజిలిస్ ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారి తెలిపారు.
ఈ ఘటనపై లాస్ ఏంజిల్స్ నగర మేయర్ కరెన్ బాస్ స్పందించారు. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లతో సహా 100 మందికి పైగా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందిని సంఘటనా స్థలానికి చేరుకున్నారని, సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు.
-
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!! -
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే!












Click it and Unblock the Notifications