Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికన్ పోలీసులకు సెక్స్ వర్కర్ బంపర్ ఆఫర్: ఉద్యోగాలను వదిలేస్తే.. ఓ రాత్రి ఫ్రీగా

వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం నెలకొన్న పరిస్థితుల్లో మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా లక్షలాది మంది నల్లజాతీయులు దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. విధ్వంసానికి పాల్పడుతున్నారు. రాజధాని వాషింగ్టన్ డీసీ సహా అమెరికా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వేలాదిమంది ఆఫ్రికన్ అమెరికన్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

 రోజురోజుకూ రెట్టింపు..

రోజురోజుకూ రెట్టింపు..

కనిపించిన వారిని కనిపించినట్టే అదుపులోకి తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు, పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చాలా రాష్ట్రాల్లో ఆందోళనకారులను అణచివేయడానికి పెద్ద ఎత్తున పోలీసులు బరిలో దిగుతున్నారు.

అయినప్పటికీ ఆందోళనకారులు ఎక్కడా తగ్గట్లేదు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా రోజురోజుకూ తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలను చేస్తూ, నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు.

పోలీసు చర్యల పట్ల సెక్స్ వర్కర్

పోలీసు చర్యల పట్ల సెక్స్ వర్కర్

నల్లజాతీయుల ఆందోళన హింసాత్మకంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్‌పైనే దాడికి పాల్పడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఓ సెక్స్ వర్కర్ ఆందోళనకారులకు సంఘీభావాన్ని ప్రకటించారు. వారికి మద్దతుగా తానూ రోడ్డెక్కారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పు పడుతున్నారు. పోలీసులను లంచగొండులుగా అభివర్ణిస్తున్నారు. లంచం ఇస్తే ఎలాంటి పనైనా చేస్తారని ఆరోపిస్తున్నారు. ఆందోళనకారులపై పోలీసు చర్యల పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగాలను వదిలేస్తే..

ఉద్యోగాలను వదిలేస్తే..

ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారికి తనతో ఒక రాత్రి గడిపే అవకాశాన్ని ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. డబ్బులు తీసుకోనని, ఉచితంగా ఓ రాత్రి ఎంజాయ్ చేయవచ్చని ఆఫర్ పెట్టారు.

టెక్సాస్‌కు చెందిన ఆ సెక్స్ వర్కర్ ఆందోళనకారుల నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పోలీసులు లంచం ఇస్తే ఎలాంటి పనయినా చేస్తారనే విషయం తనకు తెలుసని, ఉద్యోగాన్ని వదిలేసే పోలీసులకు తన శరీరాన్ని లంచంగా ఇస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

 ఈ ఆఫర్ పట్ల నెటిజన్లు విభిన్నంగా

ఈ ఆఫర్ పట్ల నెటిజన్లు విభిన్నంగా

ఆ సెక్స్ వర్కర్ చేసిన ఈ ప్రపోజల్ పట్ల నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇక్కడా జాతి వివక్ష కనిపిస్తోంది. ఆమె ఇచ్చిన ఈ ఆఫర్‌ను ఎవరూ స్వీకరించవద్దంటూ కొందరు పోలీసులను కోరుతున్నారు. సెక్స్ వర్కర్ల ఉచ్చులో పడకూడదని పోలీసులకు హితవు చెబుతున్నారు. అదే సమయంలో మరి కొందరు ఆమె పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో ఆమె ఇలాంటి ఆఫర్ ఇచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+