Yevgeny Prigozhin:ప్రిగోజిన్ మరణం వెనక పుతిన్ హస్తం..?

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మెర్సినరీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెని ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందాడంటూ వార్తలొచ్చాయి. అయితే నిజంగానే ప్రిగోజిన్ ఆ ప్రమాదంలో మరణించాడా లేక దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ప్రిగోజిన్ చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే విమాన ప్రమాదంలో మృతి చెందడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

యెవ్‌గెని ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడంటూ వార్తలు వచ్చాయి. అయితే దీని వెనక రష్యా అధ్యక్షుడు పుతిన్ కుట్ర పన్నారనే వార్త దావనంలా పాకింది. పుతిన్ కనుసన్నల్లో పనిచేసే రష్యా సైన్యం ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న బిజినెస్ ఫ్లయిట్‌ను కూల్చివేశాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలడానికి ముందు రెండు పెద్ద పేలుడు శబ్దాలు విన్నట్లు చెబుతున్నారు.విమానం ఆకాశం నుంచి కిందకు పడిపోతున్న వీడియో కూడా వైరల్‌గా మారింది.

Shadows of Doubt:The perplexing case of Prigozhins death and the Putin connection

రష్యా సైన్యమే ఈ విమానంను కూల్చినట్లు స్పష్టమవుతోందని ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రష్యా రక్షణశాఖ మాత్రం ఘటనపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది.అయితే పుతినే ఈ హత్య చేయించి ఉంటాడని చెప్పేందుకు రుజువులున్నాయంటూ పలువురు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రిగోజిన్ తిరుగుబాటు జెండా ఎగురవేసిన తర్వాత పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రిగోజిన్‌ను క్షమించకూడదని భావించాడు.ఈ తిరుగుబాటు కొద్ది రోజులే అయినప్పటికీ.. ఇది పుతిన్ అహం మీద దెబ్బకొట్టడంతో భవిష్యత్తులో ప్రమాదం అని భావించిన రష్యా అధ్యక్షుడు ప్రిగోజిన్‌ బతకకూడదని భావించాడని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రిగోజిన్ మరణం ముందుగానే ఊహించిందే అని చెప్పుకొచ్చారు.తిరుగుబాటు చేసి సరిగ్గా రెండు నెలల్లో ప్రిగోజిన్ మరణవార్త విన్నామని చెప్పారు.

ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 14 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజెన్ మృతి వెనక కూడా పుతిన్ హస్తం ఉండే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రిగోజిన్ బతికే ఉన్నాడని తన మృతిని ఒక భూటకపు మృతిగా ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నాడనే వెర్షన్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+