Sheikh Hasina:షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష
Sheikh Hasina: కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షను బుధవారం బంగ్లాదేశ్ కోర్టు విధించింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఈ తీర్పును ప్రకటించింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1 ఛైర్మ జస్టిస్ ఎండీ గోలాం మోర్తుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం షేక్ హసీనాకు 6 నెలల శిక్షను ఖరారు చేసింది. షేక్ హసీనాకు విధించిన శిక్ష ఆమె అరెస్ట్ లేదా లొంగిపోయిన రోజు నుంచి అమల్లోకి వస్తుంది.
షేక్ హసీనాతో పాటు గాయీబంధాలోని గోబిందాగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్‌కు కూడా అదే కోర్టు ధిక్కరణ నియమం కింద రెండు నెలల జైలు శిక్షను ట్రిబ్యునల్ విధించింది. బుల్బుల్ ఢాకాకు చెందిన రాజకీయ వ్యక్తి.. అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్(BCL)తో సంబంధం కలిగి ఉన్నాడు. గతేడాది అక్టోబర్‌లో షేక్ హసీనా, షకీల్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, దానిపై ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆమెపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఆ ఆడియోలో షేక్ హసీనాగా గుర్తించబడిన ఒక గొంతు ఇలా అన్నట్లు నివేదించబడింది. "నాపై 227 కేసులు దాఖలయ్యాయి. కాబట్టి నాకు 227 మందిని చంపడానికి లైసెన్స్ లభించింది" అన్నట్లు ఈ లీకైన ఆడియోలో ఉంది. ఈ ప్రకటన కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ వాదించింది.

గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవిని కోల్పోయి దేశం వీడిన షేక్ హసీనా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షేక్ హసీనాతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు , సైనికాధికారులపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఢాకా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే షేక్ హసీనాకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. స్వదేశానికి రప్పించేందుకు మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఒక కేసులో షేక్ హసీనా దోషిగా తేలడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications