Sheikh Hasina: బంగ్లా సర్కార్ పై నిప్పులు చెరిగిన హసీనా..! ఢిల్లీలో ఆడియో సందేశం..!

గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన ప్రజా తిరుగుబాటులో అధికారం కోల్పోయి భారత్ లో శరణార్ధిగా తరలివచ్చి ఉంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ఇవాళ తొలిసారి బహిరంగంగా నోరువిప్పారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌ లో హాజరైన వారిని ఉద్దేశించి ఆడియో సందేశం ద్వారా మాట్లాడారు. తన స్వదేశంలో రాజకీయ సంక్షోభాన్ని బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, రాజ్యాంగం కోసం అస్తిత్వ యుద్ధంగా ఆమె అభివర్ణించారు. అలాగే విదేశాలకు సేవ చేసే కీలుబొమ్మ పాలనను పడగొట్టేందుకు కలిసి రావాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

షేక్ హసీనా ఆడియో సందేశం

గతేడాది బంగ్లాదేశ్ ను వదిలి వచ్చేశాక భారత్ లో హసీనా చేసిన తొలి ప్రసంగం ఇది. తన స్పీచ్ లో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా ... నోబెల్ గ్రహీత అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చట్టవిరుద్ధమైన, హింసాత్మక ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. దేశాన్ని ఉగ్రవాదం, చట్టవిరుద్ధం ప్రజాస్వామ్య బహిష్కరణ యుగంలోకి నెట్టారని విమర్శించారు.

Sheikh Hasina s Exile Fire Read Why She Called Yunus a Murderous Fascist

యూనుస్ పై తీవ్ర విమర్శలు

'సేవ్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్' అనే పేరుతో నిర్వహంచిన ఈ కార్యక్రమానికి హసీనా పార్టీ అవామీ లీగ్ కు చెందిన అనేక మంది మాజీ మంత్రులు, బంగ్లాదేశ్ డయాస్పోరా సభ్యులు హాజరయ్యారు. హసీనా స్వయంగా హాజరు కాకపోయినా.. ఆమె ప్రసంగం ఆడియోను ప్రసారం చేశారు. ఈ సందర్భంగా హసీనా యూనుస్ ను హంతక ఫాసిస్ట్, వడ్డీ వ్యాపారి, డబ్బు అక్రమంగా తరలించేవాడు, అధికార దాహం గల దేశద్రోహి అంటూ పలు పేర్లతో విమర్శించారు.

Sheikh Hasina s Exile Fire Read Why She Called Yunus a Murderous Fascist

అరాచక బంగ్లాదేశ్

తాను అధికారం కోల్పోయిన నాటి నుంచి దేశం భయానక యుగంలోకి నెట్టబడినట్లు హసీనా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఇప్పుడు బహిష్కరణకు గురైందన్నారు. మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛకు ఆటంకాలు ఏర్పడి మహిళలు , మైనారిటీలపై హింస అదుపు లేకుండా వృద్ధి చెందడానికి అనుమతి లభించిందన్నారు. జీవితానికి, ఆస్తికి భద్రత లేదని, శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయని విమర్శించారు. దేశానికి ద్రోహం చేయడం ద్వారా హంతక ఫాసిస్ట్ యూనస్ మన ప్రియమైన మాతృభూమిని విపత్తు వైపు నెడుతున్నారని హసీనా ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+