viral video: వీడు మాములోడు కాదు.. సింహాలతో సెల్ఫీ, ఎక్కడ, ఎవరంటే...?
ఎలుక, బొద్దింక చూస్తేనే కొందరు భయపడిపోతారు. అంటే స్త్రీలే కాదు.. పురుషులకు కూడా భయమే. కొందరే డేర్ చేస్తారు. అవును.. కానీ పులి, సింహాలతో స్నేహం.. ఫోటోలు తీసుకోవడం రేర్. కానీ అలాంటిది ఓ షేక్.. ఏకంగా సింహాలతో కలిసి సెల్ఫీ దిగాడు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ చేశాడు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. లైక్స్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే 137కే పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది షేర్ కూడా చేస్తున్నారు.

సింహాలతో సెల్ఫీ
సింహం అంటే భయపడిపోతుంటా.. హడలెత్తి పోతాం. గజ్జుమని భయపడిపోతాం.. సింహాలతోనే నవ్వుతూ సెల్పీ దిగాడు. సింహాలతో వాకింగ్ చేస్తున్నాడు. మృగరాజులతో ఆటాడుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్ అవుతోంది. చూసినవారు అంతా అతని ధైర్య సాహసాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతని పేరు హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త. సింహాలపై తనకున్న ప్రేమను సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటాడు. ఈ సారి చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

3 సింహాలు
అయితే ఈ సారి మాత్రం సింహాలతో కలిసి దిగిన వీడియోను షేర్ చేసుకున్నాడు. ఒక సింహం చెట్టుపైకి ఎక్కగా, మరో రెండు కింద ఉన్నాయి. వాటికి కొంతదూరంలో హుమైద్ సెల్ఫీ తీసుకున్నాడు. అతని ధైర్య సాహసాలను జనం మెచ్చుకుంటున్నారు. నిజమేనా అని మరికొందరు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. అవును చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. వావ్ అంటూ.. అతనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

జూ లో ఇలా..
హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్ దుబాయ్‌లో గల అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ సీఈవో. అతడికి అల్బుకైష్ జంగిల్ అనే ప్రైవేట్ జూ కూడా ఉంది. ఎడారి మధ్యలో ఉండే ఇందులో సింహాలు, పులులు, హైనాలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు ఉన్నాయి. ఆ జంతువులతో హుమైద్ అప్పుడప్పుడు ఆడుకుంటాడు. వాటి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుంటాడు. తాజాగా సింహం చెట్టెక్కిన వీడియో పోస్ట్ చేశాడు. దానికి తెగ లైక్స్ వస్తున్నాయి. 137కే లైక్స్‌తో దూసుకువెళ్తుంది. చాలా మంది షేర్ చేస్తున్నారు. అతని ధైర్యాన్ని మాత్రం ప్రశంసించలేకుండా ఉండలేకపోతున్నారు. రెప్పపాటు దూరంలో 3 సింహాలు ఉన్నాయి. అయినా మొక్కవొని దీక్షతో ఆయన సెల్ఫీ వీడియో తీశారు.












Click it and Unblock the Notifications