డెలివరీ ఐన స్త్రీ పైన రేప్, చనుబాలివ్వాలని బలవంతం
లివర్ పూల్: ఓ మహిళ పైన అత్యాచారం చేయడమే కాకుండా... చనుబాలు ఇవ్వాలని బలవంతం చేశాడు ఓ వ్యక్తి. ఓ మహిళ ఓ బిడ్డకు జన్మను ఇచ్చింది. బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత ఓ వ్యక్తి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను అతడితో ఆగకుండా.. బిడ్డకు బదులు తనకు పాలివ్వాలని ఆమెను బలవంతం చేశాడు.
ఈ దారుణానికి పాల్పడిన కెవిన్ గిబ్సన్‌కు జైలు శిక్ష విధించారు. అతనికి న్యాయాధికారి శుక్రవారం 25 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అతని వయస్సు 50. గిబ్సన్ ఇద్దరు మహిళల పైన అత్యాచారానికి పాల్పడ్డాడు.

అతని చేతిలో అత్యాచారానికి గురైన మొదటి బాధితురాలు మాట్లాడుతూ.. అతను తన జీవితాన్ని పీల్చి పిప్పి చేశాడని ఆవేదన చెందింది. బిడ్డ పుట్టిన తర్వాత అత్యాచారం చేయబడి, బిడ్డకు బదులు తనకు పాలు ఇవ్వాలని బలవంతం చేసిన మరో బాధితురాలు.. తాను కుప్పకూలిపోయానని, ఓ సమయంలో చనిపోవాలనుకున్నానని చెప్పింది.
ఓ బాధితురాలితో బలవంతంగా సెక్స్‌లో పాల్గొని, దానిని వీడియో తీసి, బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని తెలుస్తోంది. బాధిత మహిళలు ఇద్దరు ఒకే వీధిలో ఉంటున్నారు. కాగా, అతనిని మూడు వారాల పాటు విచారించిన పోలీసులు 11 నేరాలలో నిందితుడిగా గుర్తించారు.












Click it and Unblock the Notifications