ఇదేం విడ్డూరం.. స్విమ్ సూట్ లో వచ్చి ఓటేస్తున్న ఆస్ట్రేలియన్స్.. ఎందుకంటే ?
ఒక దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది వారి బాధ్యత. ఇక్కడ కూడా ఓటింగ్ సజావుగా జరుగుతున్న తరుణంలో ఓటర్లు వస్తున్నారు ఓట్లు వేస్తున్నారు. కానీ అనూహ్యంగా స్విమ్ సూట్ లో వచ్చిన కొందరు ఓటర్లు.. ఓటు వేసి ఒక ఫోటో దిగి వెళ్లిపోతున్నారు. ఈ తరహా విడ్డూరమైన ఘటన సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేయడంతో ఫుల్ గా వైరల్ గా మారింది. దీంతో ఈ పోస్టులను చూసిన నెటిజన్లు సైతం ఇదేం విడ్డూరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలో ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్‌కి చెందిన లేబర్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా అల్బనీస్ పార్టీ వెళ్తున్నట్లు మీడియా సంస్థలు సైతం చెబుతున్నాయి. తదుపరి పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పలువురు స్విమ్‌సూట్స్ ధరించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇందుకు గల కారణం ఏంటా అని తెగ వెతికేస్తున్నారు. అయితే ఓటింగ్ రోజున పాటించాల్సిన డ్రెస్ కోడ్ గురించి ఆస్ట్రేలియాలో ఎలాంటి నిబంధన లేదని తెలుస్తోంది. దాంతో పాటు 'బడ్జీ స్మగ్లర్స్' అనే సంస్థ ఇచ్చిన ఆఫరే స్విమ్‌సూట్స్ వేసుకోవడానికి కారణమని భావిస్తున్నారు. అండర్వేర్లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్ మీడియాలో షేర్ చేస్తే తమ బ్రాండెడ్ స్విమ్వేర్ను ఉచితంగా ఇస్తామని గత ఎన్నికల వేళ ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకే పలువురు ఈ రకంగా పోలింగ్ సెంటర్స్ కి వెళ్లి ఓటేసి పోస్ట్ చేసినట్టు స్పష్టం అవుతుంది. ఈ ఫొటోలను #SmugglersDecide హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేస్తున్నారు.
అంతే కాకుండా ఆస్ట్రేలియాలో మరో ప్రత్యేకత 'డెమోక్రసీ సాసేజ్'. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సాసేజ్‌లు అందించడం అక్కడ సంప్రదాయంగా మారిపోయింది. బ్రెడ్‌లో వంచిన గ్రిల్ చేసిన సాసేజ్‌కు ఆనియన్స్, కెచప్‌తో గార్నిష్ చేసి అందిస్తారు. ఇది దేశవ్యాప్తంగా ప్రజలకు ఓటింగ్‌కు రావడానికి ఒక మోటివేషన్‌గా కూడా పనిచేస్తోంది. ఈసారి జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో దిగువ సభకు మొత్తం 151 స్థానాలున్నాయి. మొత్తం 18 మిలియన్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
When Aussies voted without pants.
— Raghunath AS 🇮🇳 (@asraghunath) May 21, 2022
The Austrailain swimwear brand 'Budgy Smuggler' put SM call out to “exercise their constitutional right to vote without pants on”! Co offered a free pair to anyone voting in their smugglers & posting a photo with the hashtag #SmugglersDecide. pic.twitter.com/nWrNP0RQr8
have your say, the Smuggling way! #smugglersdecide @anafoscatini really making her vote count 🗳 https://t.co/YbLwJMe0kk pic.twitter.com/GJB2Tmicfy
— #BudgySmuggler (@BudgySmuggler) May 20, 2022
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications