రియాలిటీ షో కోసం వెళ్తుంటే హెలికాప్టర్ కూలి మృతి
చిలీ: ఓ టీవీ రియాలిటీ షోకు చెందిన హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు మృతి చెందిన విషాధ సంఘటన చిలీలో జరిగింది. స్థానిక అధికారుల సమాచారం మేరకు... రియాలిటీ షోకు చెందిన టీంను తీసుకు వెళ్తున్న హెలికాప్టర్ వెక్టర్న్ అర్జెంటీనాలో కూలింది.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బెల్ 206 హెలికాప్టర్ శనివారం నాడు కూలిపోయింది. భద్రతా మంత్రి వెర్నియర్ మాట్లాడుతూ... హెలికాప్టర్ పొట్రెరిల్లోస్ ది మెండోజా రిజర్వాయర్ వద్ద వెయ్యి కిలోమీటర్ల ఎత్తున ఎగురుతున్న సమయంలో ప్రమాదం సంభవించిందని చెప్పారు.

ఈ ప్రమాద ఘటనలో పైలట్, ఓ టెక్నిషియన్ మృతి చెందాడన్నారు. హెలికాప్టర్‌లో ఇంకా ఎవరున్నారో తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తున్నట్లు చెప్పారు. ఇది ఉపరితలానికి అరవై మీటర్ల లోతులో ఉందని, అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
దీనిపై ఆ టీవీ యాజమాన్యం స్పందించవలసి ఉంది. కాగా, రియాలిటీ షో కోసం వెళ్తుండగా ఈ ఏడాది జరిగిన రెండో ప్రమాదమిది. గత మార్చి నెలలో రెండు హెలికాప్టర్లు రియాలిటీ షో కోసం పని చేస్తుండగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పదిమంది మృతి చెందారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications