మగాడిని కార్లో రేప్ చేసిన ఇద్దరు మహిళలు, నగ్నంగానే
చికాగో: అమెరికాలో ఆశ్చర్యపోయే సంఘటన వెలుగు చూసింది. ఇద్దరు యువతులు ఓ వ్యక్తిని రేప్ చేసిన సంఘటన జరిగింది. సదరు వ్యక్తిని గ్యాంగ్ రేప్ చేసిన యువతులు, అనంతరం అతని వద్ద ఉన్నవి దోచుకున్నారు. ఈ సంఘటన అమెరికాలోని చికాగోలో జరిగింది.
అందులో ఓ నిందితురాలిని సియెరా రోస్‌గా గుర్తించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రోస్, ఆమెతో పాటు మరో నిందితురాలిని చికాగో పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బాధితుడికి నిందితులు ఇద్దరు లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పడంతో అతను అంగీకరించాడు. అతని వయస్సు 33. అయితే అతను ఆ తర్వాత వారి అసలు ఉద్దేశ్యాన్ని గుర్తించాడు.

రోస్ తన గన్‌ను తీసి అతనికి ఎక్కు పెట్టింది. అతనిని వెనుక సీట్లోకి వెళ్లమని హెచ్చరించింది. అనంతరం అతని దుస్తులు విప్పేయాలని గన్ చూపించి బెదిరించింది. తనతో మొదట సెక్స్‌లో పాల్గొనాలని చెప్పింది. అనంతరం ఆమె స్నేహితురాలు కూడా అదే పని చేసింది.
అనంతరం ఆ మహిళలిద్దరు కూడా అతని నుండి 200 డాలర్లు, క్రెడిట్ కార్డులు దోచుకున్నారు. అతను వారి నుండి ఎలాగోలా తప్పించుకున్నాడు. వారి నుండి ఎలాగో తప్పించుకొని కారు నుండి బయటకు వచ్చాడు. అతను బట్టలు లేకుండానే బయటకు వచ్చాడు. ఓ ట్యాక్సీ దొరికింది.
క్యాబ్ డ్రైవర్ సహాయంతో బాధితుడు రోజ్ కారు లైసెన్స్ ప్లేట్‌ను ఫోటో తీశాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. చికాగో పోలీసులు రోజ్‌ను అరెస్టు చేశారు. కాగా, రోజ్ గతంలో వ్యభిచారంలో అరెస్టయినట్లుగా తెలుస్తోంది. రోజ్ పైన పోలీసులు అత్యాచారం, దోపీడీ కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications