ఆడుకుంటూ వెళ్లి అస్తికలు తిన్న చిన్నారి.. తర్వాత ఏమైందంటే..?
చిన్నపిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి అని పెద్దలు ఊరికే అనలేదు. తెలిసీతెలియని వయసులో వాళ్లు ఏదిపడితే అది నోట్లో పెట్టుకోవడం సహజం. ఇలాంటి ఘటనే ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. అవును.. ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఇంట్లోని అస్తికలను తిన్నది. ఈ షాకింగ్ ఘటన యూకేలో జరిగింది. ఈ కథనం లండన్ కు చెందిన ప్రముఖ దినపత్రిక డెయిలీ మెయిల్ లో వెలువడింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
యూకేకు చెందిన నటాషా ఎమినీ.. తన సంవత్సరన్నర కుమారుడు కోహ్ ను ఇంట్లోని ఓ రూమ్ లో వదిలి మేడ మీదకు బట్టలు ఆరేసేందుకు వెళ్లింది. ఆ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నటాషా తండ్రి అస్తికలు భద్రపరిచిన బాక్స్ ఓపెన్ చేశాడు. ఆ అస్తికల్ని పూర్తిగా తినేశాడు. తర్వాత తల్లి వచ్చి చూసి షాక్ కు గురైంది. మా నాన్నను తినేశావ్.. నువ్ మా నాన్నను తినేశావ్ అంటూ అరిచింది. దీంతో ఆ చిన్నారి అక్కడి నుంచి పరుగు తీసింది.

అందుకు సంబంధించిన వీడియోను నటాషా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను వేల మంది చూశారు. అయితే కొంతమంది ఇది ఏప్రిల్ ఫూల్ అని కామెంట్ చేయగా.. కాదు ఇది నిజంగా జరిగిందని నటాషా బదులిచ్చింది. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుంటున్నానని కామెంట్ చేసింది. 'నేను బట్టలు ఆరవేయడానికి మేడపైకి వెళ్లాను. కొన్ని నిమిషాల తర్వాత వచ్చి చూసేసరికి కోహ్ బట్టలపై అస్తికల పౌడర్ కనిపించింది. చూసి షాక్ అయ్యాను. కోహ్ ఆ అస్తికలను తిన్నట్లు గుర్తించాను. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నాను' అని పేర్కొంది.
యూకేలోని మీడియాతో మాట్లాడిన నటాషా.. ప్రస్తుతం బాబు ఆరోగ్యం బాగానే ఉందని, అస్తికలు ఎక్కువగా తినలేదని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications