శృంగారంలో తేలియాడండి: హాలీడే ప్రకటించిన కాలేజ్
సాధారణంగా విద్యార్థులకు సెలవులంటే పరీక్షల సన్నద్ధతకో లేదా విశ్రాంతికో ఇస్తుంటారు. కానీ, చైనాలోని సిచువాన్ సౌత్‌వెస్ట్ వొకేషనల్ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ మాత్రం రూట్ మార్చింది. ఏప్రిల్ 1 నుంచి 6 వరకు ఆ కళాశాల విద్యార్థులకు "వసంత సెలవులు" (Spring Break) ప్రకటించింది. అయితే ఇవి మామూలు సెలవులు కావు.. "పువ్వులను చూస్తూ ప్రకృతిని ఆస్వాదించండి.. శృంగారంలో తేలియాడండి" (Enjoy the flowers, enjoy romance) అనే థీమ్‌తో ఈ వెకేషన్‌ను డిజైన్ చేసింది. అంటే, పుస్తకాలు పక్కన పెట్టి, హాయిగా ప్రేమలో పడమని, సంబంధాలను మెరుగుపరుచుకోమని కాలేజీ యాజమాన్యం అధికారికంగా ప్రోత్సహిస్తోంది.
చైనా అంటేనే కఠినమైన క్రమశిక్షణ, రేయింబవళ్లు చదువులకే ప్రాధాన్యత ఇచ్చే దేశం. మరి అటువంటి చోట ఈ 'లవ్ బ్రేక్' వెనుక ఒక బలమైన జాతీయ సంక్షోభం దాగి ఉంది. దశాబ్దాలుగా కేవలం గ్రేడ్‌లు, ర్యాంకులు, ఉన్నత ఉద్యోగాల కోసం పరుగెత్తిన యువత.. సామాజిక జీవితాన్ని, ప్రేమను, పెళ్లిని పూర్తిగా విస్మరించారు. దీని ప్రభావం చైనా జనాభాపై తీవ్రంగా పడింది.

2025 నాటికి వరుసగా నాలుగో ఏడాది కూడా చైనా జనాభా రికార్డు స్థాయిలో క్షీణించింది. యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండటం, పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపకపోవడం డ్రాగన్ కంట్రీని వణికిస్తోంది. అందుకే, "ముందు ప్రేమించండి.. ఆపై పెళ్లి చేసుకోండి" అని చెప్పడానికి ప్రభుత్వం ఇలాంటి వినూత్న మార్గాలను వెతుకుతోంది.
ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి..
ఈ సెలవుల వెనుక కేవలం జనాభా పెంచాలనే లక్ష్యమే కాదు, ఒక భారీ ఆర్థిక వ్యూహం కూడా ఉంది. పని ఒత్తిడిలో మునిగిపోయిన చైనీయులు ఖర్చు చేయడం తగ్గించేశారు. ఇప్పుడు ఈ వసంత సెలవుల ద్వారా 140 కోట్ల మంది ప్రజలు బయటకు వచ్చి ప్రయాణాలు చేయాలని, పర్యాటక రంగానికి ఊతం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులు బయటకు వెళ్లి తిరగడం వల్ల పర్యాటక రంగం పుంజుకోవడమే కాకుండా, దేశీయ వ్యయం పెరిగి బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం వస్తుందని అధికారుల అంచనా.
ఒత్తిడి నుంచి ఉపశమనం..
కేవలం చదువులే లోకమని బతికే విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఒక గొప్ప మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రేడ్-కేంద్రీకృత జీవనశైలి నుంచి దూరంగా జరిగి, ప్రకృతితో మమేకమై సామాజిక సంబంధాలను ఏర్పరచుకోవడం వల్ల యువతలో సృజనాత్మకత పెరుగుతుందని కాలేజీ యాజమాన్యం ఆశిస్తోంది. మొత్తం మీద, "ప్రేమ కోసం సెలవులు" అనే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications