ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ లు ఇవే..

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే పాస్ పోర్ట్ తప్పనిసరి. మరి ప్రపంచంలో ఏ దేశ పాస్ పోర్ట్ శక్తివంతమైనదో తెలుసా..? ఆ వివరాలు ఇవిగో.. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్(IATA) అందించిన వివరాల ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఇండెక్స్ ఏటా ప్రపంచంలోని శక్తివంతమైన పాస్ పోర్ట్ ల జాబితాను వెల్లడిస్తుంది. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ ప్రకారం సింగపూర్ పాస్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా నిలిచింది. సింగపూర్ పాస్ పోర్ట్ కలిగిన వాళ్లు ప్రపంచంలోని 227 దేశాల్లో 193 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం చేయొచ్చు.

ఇక రెండోస్థానంలో సౌత్ కొరియా, జపాన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ లు ఉంటే 190 దేశాలకు వీసా రహిత ప్రవేశానికి అనుమతి ఉంటుంది. మూడోస్థానంలో స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఫిన్ ల్యాండ్, డెన్మార్క్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్టులు కలిగితే 187 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేసేందుకు వీలుంది.

Singapore Tops the List The World s Most Powerful Passport Revealed by Henley amp amp Partners Index

భారత్ స్థానం ఎంత..?

హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఇండెక్స్ అందించిన సర్వే ప్రకారం భారత్ 80 వ స్థానంలో ఉంది. ఇదే స్థానంలో అల్జీరియా, ఈక్వెటోరియల్ గినియా, తజికిస్థాన్ ఉన్నాయి. పక్కనే ఉన్న మయన్మార్ 88వ స్థానంలో ఉంది. శ్రీలంక 91వ స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్ 93 వ స్థానంలో ఉంది. నేపాల్ 94వ స్థానంలో ఉండగా.. యెమెన్ 96 స్థానంలో ఉంది.

ఆఖరి స్థానాల్లో..

ఇక 99వ స్థానంలో ఆఫ్గనిస్థాన్ ఉంది. ఇరాక్ 97వ స్థానంలో ఉంది. సిరియా 98వ స్థానంలో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+