• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తల్లి ఖాతా నుండి రూ. 11 లక్షలు హాంఫట్ .. ఐ పాడ్ లో ఆరేళ్ళ తనయుడి ఘనకార్యం .. ఆపిల్ సంస్థ ఏమందంటే

|

ఆపిల్ ఐపాడ్ యూజర్ తన ఖాతా నుండి 16 వేల డాలర్ల నగదు, సుమారు రూ. 11 లక్షలు మాయం కావడంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు ఇచ్చిన సమాచారం ఆమెను షాక్ కు గురి చేసింది.

ఆపిల్ ఐ పాడ్ వినియోగదారు జెస్సికా జాన్సన్ తన ఖాతా నుండి ఆపిల్‌ స్టోర్ ద్వారా , 16,000 డాలర్లు (సుమారు రూ. 11 లక్షలు) చెల్లించినట్లు గుర్తించి తీవ్ర షాక్‌కు గురైంది. అయితే జెస్సికా ఖాతా ను వినియోగించింది సైబర్ క్రైమ్ నేరగాళ్లు కాదని , ఆమె ఆరేళ్ల కుమారుడు జార్జ్ జాన్సన్ ఆపిల్ యాప్ స్టోర్‌ యాప్ లో కొనుగోలు జరిపారని తెలుసుకుని షాక్ అయింది.

సీబీఐ సేఫ్టీ లాకర్ నుండి 103 కేజీల బంగారం మాయం .. సీబీఐకి చీవాట్లు, విచారణకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు

ఆటలపై యాడ్-ఆన్‌లను చూసి గేమింగ్ యాప్స్ కొన్న ఆరేళ్ళ పిల్లాడు

ఆటలపై యాడ్-ఆన్‌లను చూసి గేమింగ్ యాప్స్ కొన్న ఆరేళ్ళ పిల్లాడు

న్యూయార్క్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం, 41 ఏళ్ల జెస్సికా తన ఆరేళ్ల కుమారుడు తన ఐప్యాడ్ ఉపయోగించి ఆపిల్ యాప్ స్టోర్ యాప్ లో 16000 డాలర్ల విలువైన గేమింగ్ యాప్స్ కొనుగోళ్లు చేశాడు. జూలైలో ఆరేళ్ల బాబు ఆడుకోవడం కోసం ఐప్యాడ్‌ను ఉపయోగించడం మొదలు పెట్టాడని, ఆటలపై యాడ్-ఆన్‌లను చూసి కొనుగోలు చెయ్యటం మొదలు పెట్టాడని , అందువల్లే లావాదేవీలు జరిగాయని దర్యాప్తుతో వెల్లడైంది .ముఖ్యంగా జూలై 8 న, జెస్సికా ఖాతా 25 సార్లు డెబిట్ చేయబడిందని ఆ ఒక్క రోజు సుమారు రూ .1.8 లక్షలు నగదు మాయం అయ్యాయని గుర్తించారు.

 ఖాతాలో నగదు మాయం .. ఆపిల్ ఐ పాడ్ హ్యాక్ చేశారని ఫిర్యాదు

ఖాతాలో నగదు మాయం .. ఆపిల్ ఐ పాడ్ హ్యాక్ చేశారని ఫిర్యాదు

జెస్సికా జాన్సన్ మొదట్లో ఆమెను హ్యాకర్లు మోసం చేశారని భావించి ఫ్రాడ్ కేసును నమోదు చేయించారు. అయితే ఆమె ఖాతా నుండి కొనుగోళ్లు జరిగాయని మరియు ఆమెను ఎవ్వరూ మోసం చేయలేదని విచారణ తరువాత ఆమెకు సమాచారం ఇచ్చారు. జెస్సికా చిన్నపిల్లవాడైన తన కుమారుడు ఆపిల్ స్టోర్ లో తెలియక కొనుగోళ్ళు జరిపిన కారణంగా ఆపిల్ సంస్థను డబ్బు తిరిగి చెల్లించమని కోరారు. అయితే ఆమె కొనుగోలు జరిగిన తరువాత 60 రోజుల్లోపు డబ్బును క్లెయిమ్ చేయనందున సంస్థ డబ్బు వాపస్ ఇవ్వడానికి నిరాకరించింది.

 యాపిల్ సంస్థను డబ్బు తిరిగిఇవ్వాలని కోరిన తల్లి .. నిరాకరించిన ఆపిల్ సంస్థ

యాపిల్ సంస్థను డబ్బు తిరిగిఇవ్వాలని కోరిన తల్లి .. నిరాకరించిన ఆపిల్ సంస్థ

అయితే 60 రోజుల్లో తాను కాల్ చేయకపోవటానికి తన ఫిర్యాదు పై జరుగుతున్న విచారణ, తాను మోసంగా భావించానన్న కారణమని జెస్సికా పేర్కొన్నారు. అంతేకాదు అది పేపాల్ మరియు ఆపిల్.కామ్ లు కలిసి చేసిన మోసం అని జెస్సికా ఆరోపించారు అని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. యాపిల్ ఐప్యాడ్ విషయంలో ఆరేళ్ల చిన్న పిల్లవాడికి ఫోన్ ఇచ్చి ఫోన్ లో తల్లిదండ్రుల నియంత్రణలను పెట్టుకోని కారణంగా ఆపిల్ జెస్సికా ను ప్రశ్నించింది .

 ఆపిల్ ఐ పాడ్ లో లాకింగ్ సెట్టింగ్స్ తెలీవన్న తల్లి , సంస్థపై ఆరోపణలు

ఆపిల్ ఐ పాడ్ లో లాకింగ్ సెట్టింగ్స్ తెలీవన్న తల్లి , సంస్థపై ఆరోపణలు

అయితే ఆపిల్ ప్రశ్నలకు సమాధానంగా వాటిలో దేని గురించి తనకు తెలియదని జెస్సికా పేర్కొన్నారు. స్పష్టంగా, దాని కోసం ఒక సెట్టింగ్ ఉందని నాకు తెలిసి ఉంటే, నా 6 సంవత్సరాల బాబుకి ఐ పాడ్ ఇచ్చి కొనుగోళ్లు చేయని చ్చేదాన్ని కాదని అని జెస్సికా చెప్పారు. ఐపాడ్ లో గేమ్స్ ఆడుతున్న కుమారుడు జరిపిన కొనుగోళ్లు అంతా గేమింగ్ కంపెనీ దోపిడి అని మరియు యాప్స్ లో వస్తువులను కొనడానికి పిల్లలను ఆకర్షించడం అని కూడా ఆమె ఆరోపించింది.

 బుడతడు చేసిన పనికి 11 లక్షల రూపాయలు మాయం .. లబోదిబోమంటున్న తల్లి

బుడతడు చేసిన పనికి 11 లక్షల రూపాయలు మాయం .. లబోదిబోమంటున్న తల్లి

మొత్తానికి ఆరేళ్ల బుడతడు చేసిన పనికి ఓ తల్లి తన అకౌంట్లో నుండి 11 లక్షల రూపాయలను పోగొట్టుకుంది. ఆ తరువాత యాపిల్ సంస్థ ను సంప్రదించి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. అలా సాధ్యం కాదని సంస్థ చెప్పడంతో ఆపిల్ స్టోర్ విషయంలో , అలాగే గేమింగ్ యాప్స్ పై సంచలన ఆరోపణలు చేసింది . చివరకు కొడుకు చేసిన పనికి డబ్బు తిరిగి రావని తెలిసి లబోదిబోమంటోంది.

English summary
Apple user Jessica Johnson was in for a rude shock when she discovered that $16,000 nearly Rs 11 lakh was paid to Apple from her account. Jessica's six-year-old son George Johnson was busy making in-app purchases on Apple App Store.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X