కొంపముంచిన స్ట్మార్ట్ వాచ్..ప్రియుడు బండారం బట్టబయలు
స్ట్మార్ట్ వాచ్ అనేది ఇప్పటి రోజుల్లో కామన్‌గా మారిపోయింది. స్ట్మార్ట్ వాచ్‌లో అనేక ఫీచర్లు ఉండటంతో యూత్ అంతా కూడా ఈ వాచ్‌లకు అలవాటు పడ్డారు. ఫోన్లు మాట్లాడటం దగ్గర నుంచి హెల్త్‌కు సంబంధించిన విషయాలు ఉండటం స్ట్మార్ట్ వాచ్ స్పెషల్ అడ్వాంటేజ్. అయితే ఓ స్ట్మార్ట్ వాచ్ తెచ్చిన తంటాతో ప్రియురాలు ప్రియుడుకు గుడ్ బై చెప్పింది.
ఓ ప్రేమికులిద్దరు ఫిట్ బిట్ స్మార్ట్ వాచ్‌ను కొనుగొలు చేసి ఒకరినొకరు ఆ వాచ్‌కు అనుసంధానం చేసుకున్నారు. దీని ద్వారా ప్రియుడు , ప్రియురాలు ఏం చేసిన కూడా ఒకరికొకరికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇదే ప్రియుడు కొంప ముంచింది. ఓ రోజు తెల్లవారుజామున 2 గంటలకు ప్రియురాలు స్ట్మార్ట్ వాచ్‌కు ఓ నోటిఫికేషన్ వచ్చింది.

తన ప్రియుడు 500 కేలరీలు బర్న్ చేసినట్టు ప్రియురాలకు నోటిఫికేషన్ మేసేజ్ వచ్చింది. ఆ సమయంలో కేలరీలు బర్న్ చేయడంతో ప్రియుడు తనని మోసం చేశాడని తెలుసుకున్న ప్రియురాలు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
నీ లవర్ నైట్ వాకింగ్ వెళ్లాడేమో అని కామెంట్స్ చేస్తుండగా, వేరే ప్రియురాలుతో నీ ప్రియుడు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ ఓ స్ట్మార్ట్ వాచ్ ప్రేమికుల కొంపముంచిందని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రియురాలు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications