వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా, కెనడాలను కుదిపేస్తున్న మంచు తుఫాను, 38 మృతి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మంచు తుఫానులో చిక్కుకున్న కారు

వణికిస్తున్న చలి కారణంగా కనీసం అమెరికా, కెనడాలలో 38 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

గత కొద్ది రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచుతోపాటు చలిగాలులకు ఈ రెండు దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.

ఒక్క అమెరికాలోనే 34 మంది మరణించారని అధికారులు తెలిపారు. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరం అత్యంత ప్రభావిత ప్రాంతంగా మారింది.

యంత్రాలతో మంచును తొలగిస్తున్న సిబ్బంది

మంచులోనే మరణాలు

కెనడాలోని బ్రిటీష్ కొలంబియా రాష్ట్రానికి చెందిన మెరిట్ పట్టణానికి సమీపంలో మంచుతో నిండిన రహదారిపై బస్సు బోల్తా పడడంతో నలుగురు మరణించారు.

గత కొద్దిరోజులుగా తీవ్రంగా ఉన్న చలి, మంచు కారణంగా విద్యుత్ సంక్షోభం కూడా ఏర్పడింది. అయితే, ఇప్పుడిప్పుడే విద్యుత్‌ను పునరుద్ధరిస్తున్నారు.

అమెరికాలో ఆదివారం మధ్యాహ్నానికి కనీసం 2 లక్షలమంది విద్యుత్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని, అయితే అంతకు ముందున్న 17లక్షల నుంచి తగ్గి ఈ స్థాయికి చేరుకుందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది.

మంచు తీవ్రత కారణంగా వేలాది విమానాలను రద్దు చేశారు. క్రిస్మస్ వేడుకలకు చాలామంది ఇళ్లకు చేరుకోలేకపోయారు.

ఆదివారం నాటికి సుమారు అయిదున్నర కోట్లమంది అమెరికన్లు తీవ్ర చలి హెచ్చరికలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

న్యూయార్క్ లోని ఓ రెస్టారెంట్ ను కప్పేసిన మంచు

'ఇంత దారుణమైన చలి ఎప్పుడూ చూడలేదు’

మంచు తుఫాను కారణంగా ఏర్పడిన పరిస్థితులు కనివిని ఎరుగని రీతిలో ఉన్నాయని, ఇవి కెనడా నుంచి దక్షిణాన ఉన్న టెక్సాస్ వరకు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు.

"బాంబు సైక్లోన్"గా చెబుతున్న ఈ శీతాకాలపు తుఫాను- వాతావరణంలో పీడనం తగ్గడంవల్ల ఏర్పడుతుంది. దీని కారణంగా భారీ మంచు కురవడంతోపాటు, చలి గాలులు వీస్తాయి.

ఈ బాంబ్ సైక్లోన్ కారణంగా అమెరికా వ్యాప్తంగా ప్రయాణాలకు అంతరాయం తీవ్ర అంతరాయం కలిగింది.

''ఈ తుఫాన్ బఫెలో నగరానికి అత్యంత వినాశకరంగా మారింది. ఇది చరిత్రలో నిలిచిపోతుంది’’ అని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ అన్నారు.

ఈ ప్రాంతంలో చనిపోయిన ఏడుగురిలో కొందరు కార్లలో, మరికొందరు మంచు తిన్నెల్లో కనిపించినట్లు ఎరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ పోలోన్‌కార్జ్ తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇంకా బ కార్లలో చిక్కుకున్న అనేకమందిని సిబ్బంది రక్షించినట్లు కూడా పేర్కొంది.

https://twitter.com/Reuters/status/1607168061424943105

సౌత్ కరోలినా స్టేట్‌లో గడ్డకట్టుకుపోయిన ఓ ఫౌంటెయిన్

అనేక రాష్ట్రాలలో ప్రభావం

వెర్మోంట్, ఒహియో, మిస్సోరీ, విస్కాన్సిన్, కాన్సాస్, కొలరాడోలలో కూడా తుఫాను సంబంధిత మరణాలు నమోదయ్యాయి.

అమెరికా పశ్చిమ రాష్ట్రమైన మోంటానాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -50F (-45C)కి పడిపోయాయి.

కెనడాలో, ఒంటారియో, క్యూబెక్ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

క్యూబెక్‌ స్టేట్‌లో ఆదివారం దాదాపు 1 లక్షా 20 వేలమంది కరెంటు లేకుండా గడపాల్సి వచ్చింది.

ఇక్కడ కొన్ని ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణకు కొన్ని రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

బాంబ్ సైక్లోన్ ఎలా ఏర్పడుతుంది?

బాంబ్ సైక్లోన్

మరికొంత కాలం ఇదే పరిస్థితి

న్యూయార్క్‌లో భారీ స్థాయి మంచు తుఫానులు కొన్నిరోజులపాటు కొనసాగే పరిస్థితితులున్నాయని అధికారులు చెబుతున్నారు.

అల్పపీడనం ఉదృతి వల్ల కెనడా నుంచి టెక్సస్, మెక్సికో సరిహద్దుల వరకూ బలమైన గాలులు, మంచు, హిమం, గడ్డకట్టించే పరిస్థితులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

English summary
Snow storm shaking America and Canada, 38 dead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X