కనువిందు చేసిన సూర్య గ్రహణం- 201 కిలోమీటర్ల ప్రయాణం
వాషింగ్టన్: ఈ ఏడాది చివరిదైన పాక్షిక సూర్యగ్రహణం (Solar eclipse 2023) చాలా దేశాల్లో కనువిందు చేసింది. అత్యంత అరుదైన గ్రహణం ఇది. రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of fire)ను ప్రజలు వీక్షించగలిగారు. ఎంజాయ్ చేశారు. ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించలేదు. దీని ప్రభావం ఇక్కడ లేదు.
దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపించింది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలిగారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూశారు.

నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, నెవడా గ్రేట్ బేసిన్ నేషనల్ పార్క్, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపించింది. ఈ సూర్యగ్రహణాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా లైవ్‌లో చిత్రీకరించింది. తన అధికారిక వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది.
భారత కాలమానం ప్రకారం- ఈ రాత్రి 9 గంటలకు సూర్యగ్రహణ కాలం ఆరంభమైంది. 201 కిలోమీటర్ల మేర సూర్యగ్రహణ ప్రయాణం సాగింది. అర్ధరాత్రి దాటిన తరువాత అంటే ఈ తెల్లవారు జామున 1:45 నిమిషాలకు గరిష్ఠస్థాయికి చేరుకుంది. 1:06 నుంచి 2:23 నిమిషాల వరకు సూర్యుడు పాక్షికంగా చీకట్లో కనిపించాడు.
సూర్యుడు- చంద్రుడు- భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంటుంది. సూర్యుడు-భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. ఈ సారి ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్ 5:17 సెకెండ్ల పాటు కనువిందు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications