దావూద్‌తో ముంబై పోలీసులకు లింక్స్: చోటారాజన్
బాలి: ఇండియన్ గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ ముంబై పోలీసుల పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది ముంబై పోలీసులకు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. ఇండోనేషియాలో జైలులో చోటా రాజన్ ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడాడు.
దావూద్ ఇబ్రహీంకు తాను భయపడనని చెప్పాడు. ముంబై పోలీసులు తనకు తీరని అన్యాయం చేశారన్నాడు. దావూద్ ఇబ్రహీంకు, తీవ్రవాదానికి నేను వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పాడు. కొంతమంది ముంబై పోలీసులకు దావూద్‌తో సంబంధాలున్నాయన్నాడు.
ప్రభుత్వం తనను ఏ జైలుకు పంపిస్తే ఆ జైలుకు వెళ్తానని చెప్పాడు. ముంబై పోలీసుల పైన తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పాడు. ముంబై పోలీసులు తనను వేధించారని ఆరోపించాడు. వారు తన పట్ల చాలా నీచంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

మిమ్మల్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలా లేక ముంబైకా అని విలేకరులు ప్రశ్నించగా... ప్రభుత్వం ఎక్కడకు తీసుకు వెళ్తే అక్కడకు పోతానని చెప్పాడు. కాగా, భారత్ పోలీసులు సోమవారం నాడు తొలిసారి చోటా రాజన్‌ను ప్రశ్నించారు. అతనిని మరో రెండు మూడు రోజుల్లో భారత్ తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications