ఫైజర్, మోడెర్నా కంటే రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ చాలా చౌక!

మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తుది ప్రయోగ దశలో ఉన్నాయి. పలు సంస్థలు తమ వ్యాక్సిన్ల ధరలను కూడా ప్రకటిస్తున్నాయి. మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు ఇప్పటికే ధరలను ప్రకటించగా.. ఇప్పుడు స్పుత్నిక్ వీ కూడా ముందుకు వచ్చింది.

Recommended Video

    COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన Pfizer.. క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలు ఇలా!

    మోడెర్నా, ఫైజర్ టీకాల కంటే కూడా తమ వ్యాక్సిన్ ధర తక్కువగానే ఉండనుందని స్పుత్నిక్ వీ సంస్థ ప్రకటించింది. ఫైజర్ టీకా ధర 19.50 డాలర్లు కాగా, మోడెర్నా వ్యాక్సిన్ ధర 25-37 డాలర్లు ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇవి రెండు డోసుల్లో తీసుకొవాల్సి ఉండటంతో వీటి ధర 39 డాలర్లు, 50-74 డాలర్లుగా ఉండనుంది. ఈ రెండింటికంటే కూడా స్పుత్నిక్ వీ టీకా ధర తక్కువగా ఉండనుందని తయారీ సంస్థ తెలిపింది.

    Sputnik V Firm Says Its corona Vaccine Cheaper Than Pfizer, Moderna

    అయితే, ఖచ్చితమైన ధరను మాత్రం సంస్థ ప్రకటించలేదు. రష్యాకు చెందిన గమలేరియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ అక్కడి ఆర్డీఐఎఫ్ సహకారంతో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఆగస్టు నెలలోనే రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. మూడో దశ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ 92 శాతం సమర్థత కనబర్చినట్లు సంస్థ తెలిపింది.

    మరోవైపు మోడెర్నా తయారు చేసిన 94 శాతం సమర్థత కలిగినట్లు ప్రకటించగా, ఫైజర్ 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఆక్స్ ‌ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధర రూ. 500-600కే అందుబాటులో ఉండనుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ఇటీవల వెల్లడించింది. రెండు డోసుల ధర రూ. 1000-1200 వరకు ఉంటుందని తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+