Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీలంక దాడులు: అదుపులో ఏడుమంది అనుమానితులు: సీసీటీవీ ఫుటేజీ విడుదల

కొలంబో: శ్రీలంకలో నరమేధానికి కారణమైన వరుస ఆత్మాహూతి దాడుల కేసుల్లో పోలీసులు ఏడుమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వారికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఐసిస్ సానుభూతిపరులై ఉండొచ్చని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పోలీసులు విడుదల చేశారు.

ఓ యువకుడు భుజానికి బ్యాగును తగిలించుకుని చర్చిలోకి ప్రవేశిస్తున్న దృశ్యం.. అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. దీన్ని స్థానిక మీడియాకు విడుదల చేశారు. నేషనల్ తౌహీక్ జమాత్ అనే ఇస్లామిక్ ర్యాడికల్ గ్రూప్ సంస్థ ఈ దాడులకు కారణమై ఉండొచ్చని మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Sri Lanka Blasts: Seven Suspects held by the Police

పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. బట్టికలోవాలోని చర్చిపై జహ్రెయిన్, కొలంబోలోని షాంగ్రిలా హోటల్ పై అబు మొహమ్మద్ అనే యువకుడు దాడులు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ రెండూ ఆత్మాహూతి దాడుల పనేనని నిర్ధారించారు.

Sri Lanka Blasts: Seven Suspects held by the Police

మిగిలిన ప్రాంతాల్లో చోటు చేసుకున్న పేలుళ్లు కూడా ఒకే తరహాలో ఉండటం వల్ల అక్కడ కూడా ఆత్మాహూతి దాడులే సంభవించి ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Sri Lanka Blasts: Seven Suspects held by the Police
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+