శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ పరార్-అంబులెన్స్ లో- అధ్యక్ష భవనంపై నిరసనకారుల దాడితో
శ్రీలంకలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కాస్తా రాజకీయ సంక్షోభంగా మారిపోయిన తర్వాత పరిస్ధితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. ఇప్పటికే దేశంలో రాజపక్సల పాలనకు వ్యతిరేకంగా నిరసనకారులు రెచ్చిపోతుండటంతో పరిస్ధితిని అదుపుచేసేందుకు తన సోదరుడు మహీంద రాజపక్స ప్రభుత్వం స్ధానంలో విక్రమసింఘేను ప్రధానిగా చేసిన అధ్యక్షుడు గోటబాట రాజపక్సకు ఇప్పటికీ ఊరట దక్కడం లేదు.
గోటబాట రాజపక్స రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్న నిరసనకారులు ఇవాళ అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. విక్రమసింఘే ప్రభుత్వం వారిని నియంత్రించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో అధ్యక్ష భవనంలోకి వెళ్లి గోటబాయపై దాడి చేస్తారని అంతా భావిస్తున్న తరుణంలో ఆయన పారిపోయారు. ఓ అంబులెన్స్ లో ఎక్కి గోటబాయ రాజపక్స పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

శ్రీలంకలో రాజపక్సలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నిరసనకారుల్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇవి ఇవాళ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులుకూ, పోలీసులూ మధ్య జరిగిన దాడుల్లో ఏడుగురు పౌరులు చనిపోయారు. ఆ తర్వాత మరింత ఆగ్రహించిన ఆందోళనకారులు అధ్యక్ష నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్ధితిని గమనించిన గోటబాట రాజపక్స అక్కడి నుంచి తప్పించుకున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications