Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణం: వందేళ్ల తరువాత..

Solar Eclipse 2024: ఈ ఏడాది మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం పలు దేశాల్లో కనువిందు చేసింది. అత్యంత అరుదైన గ్రహణం ఇది. లక్షలాది మంది స్వయంగా దీన్ని వీక్షించారు. ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఉత్తర అమెరికా ఖండంలో మాత్రమే కనిపించింది. ఆయా దేశాల ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించగలిగారు. మెక్సికో, అమెరికా, కెనడా వ్యాప్తంగా గ్రహణం కనిపించింది. న్యూయార్క్ పశ్చిమం, ఉత్తర ప్రాంతాల ప్రజలు సుమారు వంద సంవత్సరాల తరువాత సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించగలిగారు.

Star gazers of these countries enjoyed Solar eclipse 2024

మెక్సికో తీర ప్రాంత నగరం మజంట్లా వద్ద సూర్యగ్రహణ కాలం ఆరంభమైంది. మెక్సికో- అమెరికా సరిహద్దు, టెక్సాస్ దక్షిణ ప్రాంతంలో గల ఈగిల్ పాస్ మీదుగా అమెరికా, కెనడాల్లో కనువిందు చేసింది. ఈగిల్ పాస్, ఆస్టిన్, డల్లాస్, టెక్సార్‌కానా, లిటిల్ రాక్, సెయింట్ లూయిస్, ఇండియానాపోలిస్, క్లీవ్‌ల్యాండ్, బఫెలో, మాంట్రియల్ మీదుగా గ్రహణ సూర్యుడు ప్రయాణించాడు.

సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్, సౌత్ వెస్ట్ కొలరాడో, నార్త్ ఈస్ట్ అరిజోనా, సెంట్రల్ ఉటా, నెవడా గ్రేట్ బేసిన్ నేషనల్ పార్క్, నార్త్ ఈస్ట్ నెవడా, నార్త్ కాలిఫోర్నియా ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. మళ్లీ 2044లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది.

ఈగిల్ పాస్ మొదలుకుని కెనడా వరకు సోలార్ ఎక్సిప్స్ పాత్ 4,000 కిలోమీటర్లుగా నమోదైనట్లు పేర్కొంది. కెనడా కాలమానం ప్రకారం.. సాయంత్రం 5:16 నిమిషాలకు ఆ దేశంలోని న్యూఫౌండ్‌ల్యాండ్ వద్ద సూర్యగ్రహణం కాలం ముగిసింది. సూర్యుడు మూడున్నర నుంచి నాలుగు నిమిషాల పాటు గ్రహణ ఛాయలో ఉన్నాడు.

సూర్యుడు- చంద్రుడు- భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంటుంది. సూర్యుడు-భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+