ట్రంప్‌కు షాక్ మీద షాక్: వారికి 10వేల ఉద్యోగాలిస్తామన్న సంస్థ
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ పైన షాక్ తగులుతోంది. ఏడు ముస్లీం దేశాల నుంచి రాకను ట్రంప్ అడ్డుకోబోగా, ఓ మహిళా జడ్జి దానిని నిలుపుదల చేశారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ పైన షాక్ తగులుతోంది. ఏడు ముస్లీం దేశాల నుంచి రాకను ట్రంప్ అడ్డుకోబోగా, ఓ మహిళా జడ్జి దానిని నిలుపుదల చేశారు. ఆ తర్వాత వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.
ఆ తర్వాత స్టార్ బక్స్ ఓ ప్రకటన చేసింది. సంస్థ ఛైర్మన్, సీఈవో హోవార్డ్ షూల్జ్ కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. వచ్చే అయిదేళ్లలో 10,000 శరణార్థులకు ఉపాధి కల్పిస్తానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కాఫీ స్టోర్లలో వీరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు.
దీనిని అమెరికా నుంచే ప్రారంభిస్తామన్నారు. తాము అమెరికా సైన్యానికి ఎప్పుడూ మద్దతుగా ఉంటామని, ప్రస్తుతం మనకు ఎప్పుడో ప్రసాదించిన పౌరసత్వాలకు, మానవ హక్కులకు ముప్పు పొంచి ఉన్నట్లు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్నారు. మీరు వాటిని వినే ఉంటారని వ్యాఖ్యానించారు.

హిల్లరీకి మద్దతుగా నిలిచారు
హోవార్డ్ షూల్జ్ అమెరికా ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్‌కు మద్దతు పలికారు. ఒబామా కేర్ రద్దు, శరణార్థులపై విధానం, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం విషయంలో ఆయన ట్రంప్‌తో విభేదించారు.

ట్రంప్ ఆదేశాల ప్రభావం..
ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రభావం విమానయాన సంస్థల పైన కూడా పడుతోంది. ట్రంప్ జారీ చేసిన నిషేదాజ్ఞల ప్రభావం ఏడు దేశాల ప్రయాణికులతో పాటు ఆయా దేశాలకు చెందిన విమాన యాన సంస్థల సిబ్బందిపైనా పడుతోంది.

ఎమిరేట్స్ విమానయాన సంస్థ
సిబ్బందికి కూడా అమెరికాలోకి ప్రవేశం నిలిపివేయడంతో ఎమిరేట్స్ విమానయాన సంస్థ అమెరికాకు వెళ్లే విమానాల్లో సిబ్బందిని, పైలట్లను మార్చేసినట్లు ప్రకటించింది. నిబంధనలకు తగినట్లుగా కావాల్సిన మార్పులు చేసినట్లు తెలిపింది.

ఎమిరేట్స్
తమ సంస్థలో విభిన్న ప్రాంతాలకు చెందిన సిబ్బంది చాలామంది ఉన్నందున చిన్న చిన్న మార్పులతో ఇబ్బంది తొలిగిపోయిందని పేర్కొంది. ఇప్పటి వరకు ఎమిరేట్స్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని, శనివారం మాత్రం తమ ప్రయాణికుల్లో కొంతమందిపై ఈ నిషేధం ప్రభావం పడిందని పేర్కొంది. ముస్లిం మెజారిటీ దేశమైన యూఏఈలో దుబాయ్ ప్రభుత్వానికి చెందిన ఎమిరేట్స్ ఈ మేరకు ప్రకటన చేసింది.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కేంద్రం సంచలన ప్రతిపాదన, దగ్గు మందు బ్యాన్! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్











Click it and Unblock the Notifications