ప్రతినెలా ఒక యుద్ధం ఆపుతా: ట్రంప్ సంచలనం!

Donald Trump: థాయ్‌లాండ్, కంబోడియా దేశాల నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తన పాలనలో కేవలం 8 నెలల్లో 8 యుద్ధాలను ముగించామని, త్వరలో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణను కూడా పరిష్కరిస్తామని ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వం కేవలం 8 నెలల్లో ముగించిన 8 యుద్ధాల్లో ఒకటని వెల్లడించారు. అంటే సగటున ప్రతి నెలా ఓ యుద్ధాన్ని ఆపినట్లు లెక్క అని పేర్కొన్నారు.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సమస్యను త్వరలో పరిష్కరిస్తా..
ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇటీవలే ప్రారంభమైన సంఘర్షణ మాత్రమే మిగిలి ఉందని ట్రంప్ అన్నారు. దానిని కూడా తాను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు."నాకు ఇద్దరు తెలుసు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, ప్రధాన మంత్రి ఇద్దరూ చాలా మంచి వ్యక్తులు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, దీన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. "ఇది నా అభిరుచి (Hobby) అని చెప్పకూడదు, ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన విషయం. కానీ నిజం చెప్పాలంటే, నేను దీనిలో మంచివాడిని. నాకు ఇది చేయడం ఇష్టం. అయితే ఈ పనిని ఐక్యరాజ్యసమితి (UN) చేయాలి, కానీ వారు చేయరు" అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Stopping a War Every Month Donald Trump Bold Mediation Claim and Thailand-Cambodia Ceasefire

ఐక్యరాజ్యసమితిపై విమర్శలు
ట్రంప్ ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. "నేను ప్రసంగిస్తుంటే ఐక్యరాజ్యసమితి నా టెలిప్రాంప్టర్‌ను ఆపివేసింది. నేను టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడవలసి వచ్చింది. వారు అలాంటి వాటిలో మాత్రమే మంచివారు. ఎస్కలేటర్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు, ఆగిపోయింది. కానీ యూఎన్‌లో చాలా సామర్థ్యం ఉంది, వారు ఏదైనా చేస్తే బాగుండు. ఈ విషయంలో వారు మాకు ఎలాంటి సహకారం అందించలేదు" అని విమర్శించారు.

ఆసియా పర్యటనలో ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ ఆదివారం (అక్టోబర్ 26) మలేషియా చేరుకోవడంతో అతని ఐదు రోజుల ఆసియా పర్యటన ప్రారంభమైంది. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ విదేశాలలో ఇంత సుదీర్ఘంగా ఉండటం ఇదే మొదటిసారి. కౌలాలంపూర్‌లో ప్రారంభమయ్యే ఆసియాన్ సదస్సులో ట్రంప్ పాల్గొననున్నారు.

థాయ్‌లాండ్-కంబోడియా కాల్పుల విరమణ ఒప్పందం
ట్రంప్ సమక్షంలో థాయ్‌లాండ్, కంబోడియా నాయకులు విస్తరించిన కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశారు. తమ రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ట్రంప్ వ్యక్తిగతంగా చూపించిన నిబద్ధతకు థాయ్ ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఆయుధాలను ఉపసంహరించుకోవడం, యుద్ధ ఖైదీలను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన పూర్తిగా అమలు చేయబడితే, అది శాశ్వత శాంతికి పునాది వేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.

మలేషియా తర్వాత ట్రంప్ జపాన్‌కు వెళ్తారు. అక్కడ కొత్తగా ఎన్నికైన ప్రధాన మంత్రి సనే తకైచీని కలుస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ వాణిజ్య శిఖరాగ్ర సమావేశానికి ముందు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలవడానికి దక్షిణ కొరియాలోని బుసాన్ చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+