వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషి సునాక్ ‘పెద్ద తప్పిదం’ చేశారా?: వెల్లువెత్తుతున్న విమర్శలు

|
Google Oneindia TeluguNews

లండన్: అనేక సవాళ్ల మధ్య బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఇటీవల బ్రిటన్ హోం సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ ను తిరిగి అదే స్థానంలోకి తీసుకోవడంతో సునాక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాధ్యతలేని వ్యక్తులకు కీలక పదవి ఎలా ఇస్తారు?

బాధ్యతలేని వ్యక్తులకు కీలక పదవి ఎలా ఇస్తారు?

వలసలకు సంబంధించిన వ్యవహారంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సుయేల్లా బ్రేవర్మన్ ను తిరిగి పదవిలోకి ఎలా తీసుకుంటారని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వైవెట్టి కూపర్ విమర్శించారు. దేశభద్రతకు బాధ్యత వహించే కీలక పదవిలో బాధ్యత లేని వ్యక్తులను కూర్చెబెట్టడం సరికాదన్నారు. రిషి సునాక్ తీసుకున్న ఈ నిర్ణయం అతిపెద్ద తప్పిదం అని ధ్వజమెత్తారు.

రిషి సునాక్ మంత్రివర్గంలో కీలక మార్పులు

రిషి సునాక్ మంత్రివర్గంలో కీలక మార్పులు

దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని వైవెట్టి అన్నారు. కాగా, సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గంలో పలు కీలక మార్పులు చేశారు. కొందరికి ఉద్వాసన పలకడంతోపాటు మరికొందరిని తన బృందంలోకి తీసుకున్నారు. బ్రిటన్ ఉపప్రధానిగా డొమినిక్ రాబ్ నియమించిన రిషి సునాక్.. ప్రస్తుత ఆర్థికమంత్రిగా ఉన్న జెరిమీ హంట్ ను అదే పదవిలో కొనసాగించారు.

సుయెల్లా బ్రేవర్మన్ ఎంపికను సమర్థించుకున్న సునాక్

సుయెల్లా బ్రేవర్మన్ ఎంపికను సమర్థించుకున్న సునాక్

మరోవైపు, జేమ్స్ క్లైవర్లీని విదేశాంగ కార్యదర్శిగా, బెన్ వాల్సేని డిఫెన్స్ సెక్రటరీగా నియమించారు సునాక్. పార్లమెంటరీ సెక్రటరీ(చీఫ్ విప్)గా సైమన్ హార్ట్‌ను నియమించారు. అయితే, సుయెల్లా బ్రేవర్మన్ ను కూడా తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. బేవర్మన్‌ను తన టీంలో చేర్చుకోవడాన్ని సునాక్ సమర్థించుకున్నారు. ఆమె తన తప్పును తెలుసుకున్నారని, తన ఎంపిక తప్పు కాదని సునాక్ స్పష్టం చేస్తున్నారు.

అనేక సవాళ్ల మధ్య బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్

అనేక సవాళ్ల మధ్య బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్

కాగా, బ్రిటన్ రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న సమయంలోనే రిషి సునాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టడం గమనార్హం. బ్రిటన్ ప్రజలకు సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యమని, ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తప్పవని అన్నారు. ప్రస్తుతం బ్రేవర్మన్ ను తిరిగి నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ, సనాక్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.

English summary
Suella Braverman: UK MP slams Rishi Sunak's Controversial Pick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X