ధనిక దేశంలో పేదల కోసం సూపర్ మార్కెట్లు.. ఎలా సక్సెస్ అయ్యాయంటే

పేదవారు సూపర్ మార్కెట్లు

స్వీడన్‌ గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతటి అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది.

ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఒకటైన స్వీడన్ జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) పెరుగుదల ప్రభావాలనూ ప్రత్యక్షంగా చూస్తోంది.

అక్కడ ద్రవ్యోల్బణం వార్షిక పెరుగుదల నవంబర్‌లో తార స్థాయికి చేరింది.

నవంబర్‌లో 11.5 శాతం పెరుగుదల నమోదైంది.

దీని కారణంగా దేశంలోని కోటి 40 లక్షల మంది నివాసితులలో చాలామందిని ఆహారం, ఎనర్జీ ధరలు ఇబ్బందుల్లోకి నెట్టాయి. భవిష్యత్తు ప్రోత్సాహకరంగా కనిపించడం లేదు.

"స్వీడిష్ ఆర్థిక వ్యవస్థ, కుటుంబాలు రాబోయే రోజుల్లో ఒత్తిడికి లోనవుతాయి" అని ఆ దేశ ఆర్థిక మంత్రి ఎలిజబెత్ స్వాంటెస్సన్ క్రిస్మస్‌కు ముందే చెప్పారు.

గతంలో అంచనా వేసిన కంటే 2023లో దేశం మరింత మాంద్యంలోకి వెళ్తుందని ప్రభుత్వం హెచ్చరించింది.

రికార్డు స్థాయిలో విద్యుత్ ధరలు పెరగడం.. ఆహార ధరల పెరుగుదల.. రుణ చెల్లింపుల వాయిదాల మొత్తంలోనూ భారీ పెరుగుదలల కారణంగా స్వీడన్‌లోని అనేక కుటుంబాలు తమకు అలవాటు లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

జోహన్ రిన్‌డేవాల్

స్టాక్‌హోమ్‌లోని సోషల్ సూపర్‌మార్కెట్ చైన్ 'మ్యాట్‌మిషనెన్’ అధినేత జోహన్ రిండేవాల్ ఈ పరిస్థితులను ధ్రువీకరించారు.

ఈ సంవత్సరంలో కస్టమర్ల సంఖ్య రెట్టింపైంది. "చాలా మంది వ్యక్తులకు సహాయం అవసరం ఉందని మాకు మా సంస్థ ద్వారా తెలిసింది’’ అని రిన్‌డేవాల్ బీబీసీ ముండోతో చెప్పారు.

ఈ సూపర్ మార్కెట్లలో సభ్యత్వం ఆధారంగా డిస్కౌంట్ ధరలు పొందొచ్చు. అల్పాదాయ వర్గాలకే ఈ డిస్కౌంట్లు లభిస్తాయి.

రిండేవాల్ మాట్లాడుతూ తమ ఖాతాదారుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. కనీసం కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు కూడా తమ వద్ద సభ్యత్వ నమోదు కోసం, సాయం కోసం సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు.

సూపర్ మార్కెట్

స్వీడన్‌లో పేదరికాన్ని ఎలా కొలుస్తారు?

పేదరిక లెక్కలకు ఇతర అనేక దేశాలలో పాటించే విధానాలు, ప్రమాణాలను స్వీడన్ అనుసరించదు.

ఉదాహరణకు ప్రపంచ బ్యాంకు చేసిన అంచనాల ప్రకారం స్వీడన్‌లో పేద ప్రజలే లేరు.

పేదరిక కొలమానంగా స్వీడన్.. యూరోపియన్ యూనియన్ 'పావర్టీ రిస్క్’ నిర్వచనాన్నే ఉపయోగిస్తుంది.

ఆ లెక్క ప్రకారం... దేశ సగటు తలసరి ఆదాయంలో 60 శాతం కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిని పేదలుగా పరిగణిస్తారు.

సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఇటీవలి వెల్లడించిన గణాంకాల ప్రకారం స్వీడన్ జనాభాలో 15 శాతం మంది ప్రస్తుతం అలాంటి పేదరిక అంచులో ఉన్నారు. అయితే 20 సంవత్సరాల క్రితం ఇది కేవలం 9.6 శాతం మాత్రమే.

అయితే, వీరందరి జీవన ప్రమాణాలు మిగతావారి కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆకలితో అలమటించే పరిస్థితులు లేవని చెప్పారు రిండేవాల్.

"ఖర్చులను తగ్గించుకునే అవకాశం లేని కుటుంబాలను మేం గుర్తించాం. వారిదగ్గర సేవింగ్స్ మొత్తాలు కూడా లేవు. ఇది వారి జీవన ప్రమాణాలను తగ్గిస్తుంది" అని ఆయన చెప్పారు.

వేల మందిని ఆదుకొంటున్న పేదవారి సూపర్ మార్కెట్లు..

మ్యాట్‌మిషనెన్ ఒక సామాజిక సంస్థ. ఆహార వ్యర్థాలను తగ్గించడం దాని ప్రధాన లక్ష్యాలలో ఒకటి.

ఫుడ్ కంపెనీలు విరాళంగా ఇచ్చిన వాటిని వృథా కాకుండా విక్రయిస్తుంది.

అందువల్ల కస్టమర్లు ఇక్కడి వస్తువులను అసలు ధరలో మూడో వంతుకే కొనుగోలు చేయగలుగుతారు.

వీరి కస్టమర్లలో అత్యధికులు రిటైరైనవారు, నిరుద్యోగులు, వలస వచ్చినవారు ఉంటారు.

వివిధ నగరాల్లో ఈ సంస్థకు ఎనిమిది స్టోర్స్ (దుకాణాలు) ఉన్నాయి.

వాటిలో 25 వేల మందికి సేవలందిస్తుంటారు. 25 షెల్టర్లకు సంస్థ ఆహారాన్ని పంపిణీ చేస్తుంది. ఇవే పేదవారి సూపర్ మార్కెట్లు.

ఈ సంవత్సరం వారి సేవలకు ఎక్కువ డిమాండ్ రావడంతో కొత్త స్టోర్స్ (సూపర్ మార్కెట్స్) తెరిచారు.

యుక్రెయిన్ నుంచి ఎక్కువ మంది శరణార్థులు రావడం, ద్రవ్యోల్బణం పెరుగుదల దీనికి కారణాలని రిండెవాల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+