దొంగతనానికి వచ్చి గన్ పారేసుకొని.. ఫన్నీ వీడియో: బెడిసికొట్టిన ప్లాన్

కొలోరాడో: అమెరికాలోని కొలోరాడోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దొంగతానికి వచ్చి, ఓ యువతిని తుపాకీతో బెదిరించబోయి దానిని కిందపడేసుకొని, ఏమీ తోచనిస్థితిలో పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఆ దొంగ తడబడి తుపాకీని కిందపడేసుకొని, ఆ తర్వాత ఎవరైనా పట్టుకుంటారేమోనని కాళ్లకు బుద్ది చెప్పాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో అందరినీ బాగా నవ్విస్తోంది. దోపిడీకి వచ్చి ఏమాత్రం జాగ్రత్త లేకుండా బెదిరించడానికి తెచ్చుకున్న తుపాకీనే పారేసుకొని, పారిపోవడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

Suspected robber in Colorado drops gun, loses pants in attempted

కొలరెడోలోని ఓ ఈ-సిగరెట్‌ దుకాణంలో ఉద్యోగి అయిన ఓ యువతి పని చేస్తుండగా దొంగ లోపలికి ప్రవేశించాడు. ఆ వెంటనే తుపాకీ తీసి ఆమెను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని భావించాడు. తన జేబులో నుంచి తుపాకీ తీశాడు. ఆమెను బెదిరించబోయాడు.

కానీ ఆ తుపాకి ఆయన చేతుల్లో నుంచి అతని ముందు ఉన్న కౌంటర్ పైన పడి, ఆ మహిళ వైపుకు పడిపోయింది. దానిని అతను తీసుకునే ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె ఆ గన్‌ తీసుకోవడానికి ప్రయత్నించే లోపలే అతను కాళ్లకు బుద్ది చెప్పాడు. పరుగెత్తుతూ తలుపును ఎగిరి తన్నుతూ బయటపడ్డాడు.

సీసీటీవీ ఫుటేజీని కొలొరాడోలోని అరోరా పోలీసులు షేర్‌ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. కొందరు నీకు ఈ దొంగతనాలు సూట్‌ కావు వేరే పని చేసుకో అంటూ వెరైటీగా కామెంట్లు పెట్టారు. పోలీసులు దొంగను గుర్తించే పనిలో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+